అంగారకుడిపై ‘జురోంగ్‌’ తొలి అడుగులు

China Mars rover Zhurong sends back selfies from Red Planet - Sakshi

బీజింగ్‌: అంగారక గ్రహం ఉపరితలంపై జీవం మనుగడకు గల పరిస్థితులను అన్వేషించేందుకు డ్రాగన్‌ దేశం చైనా తొలిసారిగా ప్రయోగించిన జురోంగ్‌ రోవర్‌ తన విధులు నిర్వర్తించేందుకు రంగం సిద్ధమయ్యింది. శనివారం ల్యాండర్‌ నుంచి జురోంగ్‌ విజయవంతంగా బయటకు అడుగుపెట్టింది. ఆరు చక్రాలున్న ఈ రోవర్‌ బరువు 240 కిలోలు. సౌర శక్తితో పని చేస్తుంది. ల్యాండర్‌ నుంచి నెమ్మదిగా కిందికి దిగి, మార్స్‌పై ఇసుక నేలలో పాదం మోపినట్లు చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(సీఎన్‌ఎస్‌ఏ) ప్రకటించింది. అరుణ గ్రహంపై పరిశోధనల కోసం చైనా 2020 జూలై 23న టియాన్‌వెన్‌–1న మిషన్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌ ఉన్నాయి. ల్యాండర్‌ ఈ నెల 15న మార్స్‌పై దిగింది. జురోంగ్‌ రోవర్‌ మూడు నెలలపాటు పని చేయనుంది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top