అంతరిక్ష ప్రయోగాలు.. చైనా మరో ముందడుగు

China Launches Crewed Spacecraft Shenzhou 12 in Historic Mission - Sakshi

విజయవంతంగా అంతరిక్ష నౌక షెన్‌జూ-12 ప్రయోగం

నిర్మాణంలో ఉన్న స్పేస్‌ స్టేషన్‌లోకి ముగ్గురు వ్యోమగాములు

బీజింగ్‌: అంతరిక్షంలో పాగా వేయాలని భావిస్తున్న చైనా ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మర చేస్తుంది. ఇప్పటికే స్పేస్‌స్టేషన్‌ నిర్మాణం తలపెట్టని చైనా మరో ముందడుగు వేసింది. నిర్మాణంలో ఉన్న స్పేస్‌స్టేషన్‌లోకి ముగ్గురు వ్యోమగాములను తీసుకెళ్తున్న అంతరిక్ష నౌకను గురువారం ప్రయోగించింది. ఈ ముగ్గురిని టియాంగాంగ్ స్టేషన్ నుంచి లాంగ్ మార్చి -2 ఎఫ్ రాకెట్‌ ద్వారా స్పేస్‌ స్టేషన్‌లోకి పంపించారు. అక్కడ వారు మూడు నెలలు గడుపుతారు. చైనా గోబి ఎడారిలో ప్రయోగించిన ఈ రాకెట్‌ గురువారం ఉదయం 9.22 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.

చైనా తన సొంత టెక్నాలజీతో అభివృద్ధి చేస్తోన్న స్పేస్‌ స్టేషన్‌ పూర్తి చేసే క్రమంలో షెన్‌జౌ -12.. 11 మిషన్లలో మూడవది. వీటిలో నాలుగు బృందాలు ఉంటాయి. మూడు మాడ్యూళ్ళలో మొదటిది, అతిపెద్దది అయిన టియాన్హే ప్రారంభించడంతో ఏప్రిల్‌లో స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం ప్రారంభమైంది. వ్యోమగాములు నీ హైషెంగ్(56), లియు బోమింగ్(54), టాంగ్ హాంగ్బో(45), భవిష్యత్ అంతరిక్ష కేంద్ర నివాస గృహమైన టియాన్హేలో మూడు నెలలు పని చేయవలసి ఉంటుంది. చైనా షెన్‌జౌ -12 అంతరిక్ష నౌక ఏప్రిల్ 29 న భూమికి  340 నుంచి 450 కిమీ ఎత్తులో ఒక నిర్ధిష్ట కక్ష్యలో నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలోని టియాన్హె ప్రధాన విభాగంతో డాక్ అవుతుంది.

మాడ్యుల్‌లో ప్రతి దానికి ప్రత్యేక లివింగ్‌ స్పేస్‌, వ్యాయామం కోసం ట్రెడ్‌మిల్, గ్రౌండ్ కంట్రోల్‌తో ఈమెయిల్‌, వీడియో కాల్‌ల కోసం కమ్యూనికేషన్ సెంటర్‌ సదుపాయం ఉంది. మిషన్ కోసం తయారు కావడానికి, సిబ్బంది 6,000 గంటలకు పైగా శిక్షణ పొందారు. చైనా అంతరిక్ష సంస్థ వచ్చే ఏడాది చివరి వరకు మొత్తం 11 ప్రయోగాలను ప్లాన్ చేస్తోంది, వీటిలో మరో మూడు మిషిన్లలో మనుషులను తీసుకెళ్లనున్నారు. ఇవి 70 టన్నుల స్టేషన్‌ను విస్తరించడానికి రెండు ల్యాబ్ మాడ్యూళ్లను, సిబ్బందిని తీసుకెళ్తాయి. వీరు ఆన్‌బోర్డ్‌లో వ్యవస్థలను పరీక్షించి, స్పేస్‌ వాక్‌ను నిర్వహిస్తారు, శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు.

చదవండి: అంతరిక్షంపై డ్రాగన్‌ నజర్‌...!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top