చైనాలో వంతెనను ఢీ కొట్టిన భారీ షిప్.. రెండు ముక్కలైన బ్రిడ్జి

Cargo Ship Hits Bridge In Southern China - Sakshi

దక్షిణ చైనాలో వంతెనను భారీ కార్గో షిప్‌ ఢీకొట్టడంతో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. గ్వాంగ్జూ నగరంలోని పెరల్‌ నదిపై ఈ ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ షిప్‌ ఫోష్‌మన్‌ నుంచి గ్వాంగ్జూ వైపు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఉన్న లిజింగ్షా వంతెనను బలంగా ఢీకొట్టింది. తాకిడికి వంతెన రెండు ముక్కలుగా వీడిపోయింది. నౌక్‌  బ్రిడ్జి మధ్యే చిక్కుకుపోయింది

ఈ ఘటనలో ఒక బస్సుతో సహా ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. నదిలో పడిపోయిన బస్సులో కేవలం డ్రైవర్‌ మాత్రమే ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ నౌకలో ఎటువంటి సరుకు లేదని స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాదానికి కారణమైన షిప్‌ కెప్టెన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గ్వాంగ్జూ నగరం నుంచి ఆరుగురు డైవర్లతో అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

ఇదీ చదవండి: రియల్‌ లైఫ్‌ మోగ్లీ: శునకాల మధ్య పెరిగి ఆమె ఓ శునకంలా..ఇప్పటికీ..!

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top