నింగిలో ‘నీలి సూరీడు’ ఎందుకు అలరించాడు?

Britain Blue Sun Seen in the Sky What Scientists Said - Sakshi

బ్రిటన్ ప్రజలు ఆకాశంలో ఓ ప్రత్యేక దృశ్యాన్ని తిలకించి మురిసిపోయారు. మబ్బుల్లో సూర్యుని రంగు మారిపోవడాన్ని చూసి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో సూర్యుడు నీలిరంగులో కనిపిస్తున్నాడు. అమెరికాలో సంభవించిన అగ్నిప్రమాదమే ఇందుకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది.

ట్విట్టర్‌లో ఒక యూజర్‌ ‘స్కాట్లాండ్‌లో అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద కారణంగా నూతన నీలి సూర్యుడు కనిపిస్తున్నాడు’ అని అన్నారు. మరొక యూజర్‌ ఉదయం 10:15 గంటలకు ‘బ్లూ సన్’ కనిపించాడని రాశారు. కాగా గతంలో సూర్యుడు ముదురు ఆరెంజ్‌ రంగులో కనిపించాడు. 2017లో పోర్చుగీస్ అడవి కార్చిచ్చుకు సంబంధించిన పొగ బ్రిటన్ అంతటా వ్యాపించింది. అయితే ఈసారి సూర్యుడు నీలి రంగులోకి ఎందుకు మారాడనే దానికి వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు సమాధానం తెలిపారు.

ఉత్తర అమెరికాలోని అడవి కార్చిచ్చు పొగ బ్రిటన్‌కు చేరుతోంది. వాతావరణంలో మేఘాలు, పొగ కలసిపోవడం కారణంగా సూర్యరశ్మి వివిధ రంగులలో వ్యాప్తి చెందున్నదని ఆయన చెప్పారు. ప్రతి రంగు వేర్వేరు ప్రకాశాలను కలిగి ఉంటుంది. నీలి రంగు అధికంగా వ్యాపిస్తుందని తెలిపారు. పర్పుల్ రంగు తక్కువగా వ్యాపిస్తుందని, ఇది దాదాపు 380 నానోమీటర్లు ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఎరుపు రంగు పొడవైన తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుందని, ఇది దాదాపు 700 నానోమీటర్లు ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అమెరికాను ముంచెత్తిన వరదలు... న్యూయార్క్‌ అతలాకుతలం!
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top