వింతైన ఆహ్వానం: పెళ్లికి తలో ఏడేసి వేలు తీసుకురండి!

Bride Asks Seven Thousand For Wedding Guests Over Wedding Reception - Sakshi

సాధారణంగా ఆడపిల్లలకు పెళ్లి చేసే కుటుంబానికి బంధువులు, స్నేహితులు డబ్బు, వస్తువులు సమకూర్చటం చూస్తూవుంటారు. అయితే వారు అడగకపోయినా పిలిచిమరీ ఖర్చులకు అవసరం అవుతుందని డబ్బు అందిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా తాజాగా ఓ వధువు తన బంధువులు, స్నేహితులను వింతమైన విన్నపంతో వివాహ రిషెప్షన్‌కు ఆహ్వానించింది. తన వివాహానికి వచ్చే అతిథులు, బంధువులు తలో రూ.7 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఎందుకంటే పెళ్లి రిషెప్షన్‌ చేయడానికి తగినంత డబ్బు లేదని పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

అయితే వధువు స్నేహితుడొకరు సోషల్‌ మీడియాలో  ఈ విషయాన్ని పంచుకున్నాడు. ‘మా వద్ద పెళ్లివేడుకలు నిర్వహించడానికి  తగిన డబ్బు లేదు. పెళ్లికి వచ్చే బంధువులు, అతిథులుకు తలో రూ.7వేలు ($99) ఇవ్వాలని కోరుతున్నాము’ అని పెళ్లి ఆహ్వాన పత్రికలో తెలిపారని చెప్పాడు. ఇక తను ఉండే ప్రాంతం నుంచి వివాహం జరిగే చోటు చాలా దూరమని తెలిపాడు.

వివాహం జరిగే చోట ఏకంగా ఓ బాక్స్‌ ఏర్పాటు చేసి ఉందని చెప్పాడు. దానిపై ‘అతిథులారా  మా భవిష్యత్తు, కొత్త నివాసం కోసం దయచేసి డబ్బు విరాళంగా ఇవ్వండి’ అని రాసిపెట్టి ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఈ వివాహ వేడుక అమెరికాలో జరిగినట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి కూతురు డబ్బు డిమాండ్‌పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘నేను అలాంటి పెళ్లి వేడుకలకు అ‍స్సలు వెళ్లను.. వాళ్లు ఎంత దగ్గరవాళ్లు అయినా’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘ఆ జంట ఇలా చేసి  ఉండాల్సింది కాదు.. అయితే వారు చెప్పింది నిజమై కూడా ఉండవచ్చు’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top