బ్రిక్స్‌ సదస్సు: రష్యాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం | Brics Summit live pm Narendra Modi in Russia | Sakshi
Sakshi News home page

బ్రిక్స్‌ సదస్సు: రష్యాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

Oct 22 2024 1:38 PM | Updated on Oct 22 2024 3:02 PM

Brics Summit live pm Narendra Modi in Russia

కజాన్: బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు (మంగళవారం) రష్యాలోని కజాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి భారీగా తరలి వచ్చిన ప్రజలు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. రష్యా అధ్యక్షతన 16వ బ్రిక్స్‌ సదస్సును నేడు రేపు(అక్టోబర్‌ 22, 23) నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు రష్యాలోని కజాన్‌ నగరం వేదికగా మారింది. ఈ సంద్భంగా ప్రధాని మోదీ బ్రిక్స్ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో పాటు పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు.

 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ  రష్యాలో పర్యటిస్తున్నారు. ఆతిథ్య రష్యా అధ్యక్షతన 16వ బ్రిక్స్‌ సదస్సు జరుగుతోంది. 16వ బ్రిక్స్ సదస్సులో  ‘సమాన రీతిలో ప్రపంచ అభివృద్ధి’ అనే అంశంపై చర్చ జరగనుంది. కాగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశం కూడా జరగవచ్చని తెలుస్తోంది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ బ్రిక్స్‌ వ్యవస్థాపక సభ్యులతో పాటు కొత్త సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అక్టోబరు 22న తొలిరోజు సాయంత్రం నేతలకు విందు ఉంటుందన్నారు. బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో 23న క్లోజ్డ్ ప్లీనరీ, ఓపెన్ ప్లీనరీ సెషన్ ఉంటుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఈజీగా విదేశీ భాష, క్రేజీగా కొరియన్‌ నేర్చుకుందామా!

Advertisement
 
Advertisement
Advertisement