చైనాకు షాక్‌: ‘ఆ దేశ వ్యాక్సిన్‌ కొనుగోలు చేయం’

 Brazilian President Says Will Not Buy China Sinovac Vaccine - Sakshi

బ్రసిలియా:  చైనా  రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ను తమ ప్రభుత్వం కొనుగోలు చేయదని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో వెల్లడించారు. చైనా సినోవిక్‌ వ్యాక్సిన్‌ను కొనొద్దు అంటూ ఆయన మద్దతుదారులు కొంతమంది ఆయనకు సోషల్‌మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన బోల్సోనారో చైనా వ్యాక్సిన్‌ను తమ దేశం కొనదని తేల్చి చెప్పారు. ఇదిలా వుండగా  ఆరోగ్య శాఖ మంత్రి ఎడ్వర్డో పజుఎల్లో రాష్ట్ర గవర్నర్లతో జరిగిన సమావేశంలో సినోవాక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో చేర్చడానికి మంత్రిత్వ శాఖ కొనుగోలు చేస్తుందని చెప్పారు. దీనికి అదనంగా కొన్ని వ్యాక్సిన్లను ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేశాయని చెప్పారు.

సావో పాలో స్టేట్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్, బుటాంటన్ ఇన్స్టిట్యూట్, సినోవాక్ వ్యాక్సిన్‌ను పరీక్షిస్తోందని తెలిపారు. ఇక గవర్నర్ జోనో డోరియా మాట్లాడుతూ జనవరిలో ప్రజలకు కరోనా టీకాలు వేయడం ప్రారంభిస్తామని  చెప్పారు. దానికి కోసం ఈ ఏడాది చివరి నాటికి హెల్త్ రెగ్యులేటర్ ఆమోదం పొందాలని భావిస్తున్నట్లు తెలిపారు. 46 మిలియన్ మోతాదుల సినోవాక్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయడానికి ఫెడరల్ ప్రభుత్వం అంగీకరించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమావేశం అనంతరం డోరియా చెప్పారు.

కరోనావాక్ అని పిలువబడే వ్యాక్సిన్‌ను 230 మిలియన్ల జనాభా కలిగిన జాతీయ టీకా కార్యక్రమంలో చేర్చడం సినోవాక్‌కు మంచి గుర్తింపు తీసుకువస్తుందని అన్నారు. బ్రెజిల్ ప్రభుత్వం ఇప్పటికే యూకే వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి రియో ​డీ జనేరియాలోని బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్‌లో వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఇలా చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.    

చదవండి: ‘అతను చనిపోయింది మా వ్యాక్సిన్‌ వల్ల కాదు’

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top