ఇజ్రాయెల్‌ ప్రధానిగా మళ్లీ నెతన్యాహు

Benjamin Netanyahu sworn in as Israel prime minister - Sakshi

జెరుసలేం: ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రిగా లికుడ్‌ పార్టీ చీఫ్‌ బెంజమిన్‌ నెతన్యాహు(73) ఆరోసారి ప్రమాణం చేశారు. 120 మంది సభ్యులుండే నెస్సెట్‌(పార్లమెంట్‌)లో గురువారం జరిగిన బలపరీక్షలో నెతన్యాహుకు అనుకూలంగా 69 మంది, వ్యతిరేకంగా 54 మంది సభ్యులు ఓటేశారు. నెతన్యాహు బలహీనుడంటూ నినాదాలు చేసిన పలువురు ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బహిష్కరించారు.

అనంతరం నెతన్యాహు పదవీ ప్రమాణం చేశారు. అదే సమయంలో పార్లమెంట్‌ వెలుపల పెద్ద సంఖ్యలో జనం గుమికూడి నూతన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కొత్తగా సంకీర్ణంలో లికుడ్‌ పార్టీతోపాటు ఛాందసవాద షాస్, యునైటెడ్‌ టోరా జుడాయిజం, ఓట్జ్మా యెహుడిట్, జియోనిస్ట్, నోమ్‌ పార్టీలున్నాయి.

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top