breaking news
Likud Party
-
ఇజ్రాయెల్ ఎన్నికల ప్రచార హోర్డింగుపై మమ్దానీ చిత్రం
టెల్ అవీవ్: అక్లోబర్‌లో ఎన్నికలు జరగనున్న ఇజ్రాయెల్‌లో ఒక ప్రచార హోర్డింగ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. టెల్ అవీవ్ నగరం మధ్యలో అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు పార్టీ ఏర్పాటు చేసిన బిల్‌బోర్డ్‌పై న్యూయా ర్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీని చిత్రించారు. పోస్టర్లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఇరాన్ నాయకుడు మొ జ్తాబా ఖమేనీ, హెజ్బొల్లా అధిపతి నయీమ్ ఖాసెమ్ల పక్కన ఆయన ఫోటోను చిత్రించారు. ‘వారు నెతన్యాహు ఓడిపోవాలని కోరుకుంటున్నారు. వారిని గెలవనివ్వకండి’అని లికుడ్ పార్టీ లోగోతో రాశారు. గాజా కాల్పుల విరమణ ప్రయత్నాలు నిలిచిపోయిన తరుణంలో, ఈ చర్య వారి మధ్య బహిరంగ వైరాన్ని మరింత తీవ్రం చేసింది. జులైలో ఇజ్రాయెల్ నెసెట్‌ను రద్దు చేయడంతో, అక్టోబర్‌లో ఎన్నికలకు మార్గం సుగమమైంది. 2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలో దాడుల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జాతీయ ఎన్నికలు ఇవే. తన అతివాద కూటమిని తిరిగి అధికారంలో తీసుకొచ్చేందుకు నెతన్యాహు ప్రచారలోకి దిగారు. అమెరికాలో ఇటీవల జరిగిన పోల్స్‌లో, అమెరికన్ యూదుల్లో నెతన్యాహు కంటే మమ్దానీకే ఎక్కువ ప్రజాదరణ ఉందని తేలింది. అభిప్రాయ సేకరణలో తన అధికార కూటమి వెనుకబడి ఉండటాన్ని గ్రహించిన నెతన్యాహు, తన సోషల్ మీడియా ఖాతాల్లో ఆ బిల్బోర్డ్ ఫోటోను పోస్ట్ చేశారు. మమ్దానీ తనను ఒక యుద్ధ నేరస్థుడని పిలుస్తూ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్నారు. అయితే, నెతన్యాహు ఎన్నికల ప్రచార సామగ్రిలో తన చిత్రాన్ని చేర్చడంపై మమ్దానీ ఇంకా బహిరంగంగా స్పందించలేదు. మమ్దానీ తన మేయర్ ఎన్నికల ప్రచారం నుంచే గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని గట్టిగా విమర్శిస్తూ వచ్చారు. గత నెలలో నెతన్యాహును యుద్ధ నేరగాడు అనడంతో మాటల యుద్ధం తీవ్రమైంది. సెపె్టంబరులో నగరంలో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి నెతన్యాహు హాజరైతే, ఆయన అరెస్టు కోసం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన వారెంట్‌ను అమలు చేయాలని అమెరికా అధికారులకు పిలుపునివ్వడం తెలిసిందే. -
ఇజ్రాయెల్ ప్రధానిగా మళ్లీ నెతన్యాహు
జెరుసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా లికుడ్ పార్టీ చీఫ్ బెంజమిన్ నెతన్యాహు(73) ఆరోసారి ప్రమాణం చేశారు. 120 మంది సభ్యులుండే నెస్సెట్(పార్లమెంట్)లో గురువారం జరిగిన బలపరీక్షలో నెతన్యాహుకు అనుకూలంగా 69 మంది, వ్యతిరేకంగా 54 మంది సభ్యులు ఓటేశారు. నెతన్యాహు బలహీనుడంటూ నినాదాలు చేసిన పలువురు ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బహిష్కరించారు. అనంతరం నెతన్యాహు పదవీ ప్రమాణం చేశారు. అదే సమయంలో పార్లమెంట్ వెలుపల పెద్ద సంఖ్యలో జనం గుమికూడి నూతన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కొత్తగా సంకీర్ణంలో లికుడ్ పార్టీతోపాటు ఛాందసవాద షాస్, యునైటెడ్ టోరా జుడాయిజం, ఓట్జ్మా యెహుడిట్, జియోనిస్ట్, నోమ్ పార్టీలున్నాయి. -
ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహూ
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (73)కు చెందిన లికడ్ పార్టీ ఆధ్వర్యంలోని సంకీర్ణ కూటమి విజయం సాధించింది. దాంతో, రికార్డు స్థాయిలో 15 ఏళ్లకుగా పైగా ప్రధానిగా చేసిన ఆయన మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. 120 స్థానాలున్న పార్లమెంటులో 64 స్థానాలతో లికడ్ కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఫలితాలను నవంబర్ 9న ధ్రువీకరిస్తారు. ప్రధాని లపిడ్ ఓటమి అంగీకరించారు. నెతన్యాహూకు ఫోన్ చేసి అభినందించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా రాకెట్ దాడులు ఎన్నికల ఫలితాల వేళ పాలస్తీనాలోని గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి నాలుగు రాకెట్లను ప్రయోగించారు. మూడు లక్ష్యం చేరలేదు. ఒకదాన్ని ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చేసింది. అంతేగాక ప్రతిదాడులతో గట్టిగా బదులిచ్చింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజాలో హమాస్ గ్రూప్ రహస్యంగా నిర్వహిస్తున్న రాకెట్ ఫ్యాక్టరీని ధ్వంసం చేశాయి. -
నెతన్యాహూకే మళ్లీ పట్టం!
ఇజ్రాయెల్ ఎన్నికల్లో లికుడ్ పార్టీ విజయం జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహూ మరోసారి కొనసాగనున్నారు. బుధవారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో ఆయన నేతృత్వంలోని లికుడ్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో ఇప్పటికే మూడు సార్లు వరుసగా ప్రధాని పదవిని చేపట్టిన నెతన్యాహూ.. మరోసారి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆ దేశంలో పార్లమెంట్ సభ్యుల పదవీకాలం మూడేళ్లు మాత్రమే. దీంతో ఇప్పటికే 9 ఏళ్లు ప్రధానిగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఎన్నికైతే ఆ దేశ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధాని పీఠాన్ని అధిష్టించిన నేతగా రికార్డు సృష్టిస్తారు. పార్లమెంట్ లో 120 స్థానాలుండగా... పోటా పోటీగా సాగిన ఈ ఎన్నికల్లో 29 స్థానాలను లికుడ్ సాధించింది. జియోనిస్ట్ యూనియన్‌కు 24, అరబ్ పార్టీల కూటమికి 14 స్థానాలు దక్కాయి. ఎన్నికలకు ముందు రెండు రోజుల వరకు జియోనిస్ట్ యూనియన్ ముందంజలో ఉంది. పలు సర్వేలు కూడా వారికే అనుకూలంగా కనిపించాయి. కానీ ఎన్నికలకు ముందు రోజు పాలస్తీనా అంశంలో ఏమాత్రం వెనక్కితగ్గబోమని, కఠినంగా వ్యవహరిస్తామని నెతన్యాహూ చేసిన ప్రకటనతో పరిస్థితి ఒక్కసారిగా ఆయనకు అనుకూలంగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల కోసం చిన్న పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించినట్లు లికుడ్ నేతలు వెల్లడించారు.


