The Greenest Beer: షాకింగ్‌ బీర్‌: వావ్‌ అంటారా? యాక్‌ అంటారా? 

Beer From Urine At This Singapore Brewery would like to drink - Sakshi

బీర్ అంటే ఇష్టపడని మందుబాబులు ఎవరైనా ఉంటారా?  మార్కెట్లో  విభిన్న ఫ్లేవర్లలో,  రక రకాల బ్రాండ్లలో బీర్లు లభ్యమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కొత్త రకమైన బీర్  అందుబాలోకి వచ్చింది. ఈ వెరైటీ బీరుకు లభిస్తున్న ఆదరణ చూస్తే.. మరి వావ్‌.. అనాల్సిందే. 

వాస్తవానికి ఆ బీర్ దేనితో తయారువుతుందో తెలిస్తే షాక్‌ అవుతారు. ఇది తెలిసి వావ్‌ అంటారో లేదంటే.. యాక్‌ అంటారో మీరు తేల్చుకోండి. ఎందుకంటే ఈ బీర్ యూరిన్‌తో తయారవుతుంది. ఇంకో షాకింగ్‌ విషయం ఏమిటంటే దాదాపు 20 సంవత్సరాల నాటి మురుగునీటిని శుద్ధిచేసి మరీ తయారుచేస్తున్న 'యూరిన్ బీర్'ను గ్రీన్ బీర్‌గా ప్రచారం చేస్తోంది. సింగప్‌పూర్‌లోని న్యూబ్రూ కంపెనీ. సింగపూర్ న్యూబ్రూ ఉత్పత్తి చేస్తున్న యూరిన్ బీర్‌కు భారీ ఆదరణ లభిస్తుండటం విశేషం. పలురకాల పరీక్షలు, వివిధ దశల్లో వడపోత తర్వాత ఆరోగ్యకరమైన బీర్‌ను తయారు చేస్తున్నామని, త్రాగడానికి సురక్షితమని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా తమ స్పెషల్‌ బీరు ఆరోగ్యానికి  ఆరోగ్యం, అద్భుతమైన రుచి కూడా అని తెలిపింది.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, నీటి కొరతపై అవగాహన కల్పించేందుకు ప్రచారం చేపట్టిన ప్రభుత్వ నీటి సంస్థ, ఈ సమస్యను అధిగమించేందుకు వినూత్న  పరిష్కారాల్ని  అన్వేషిస్తోంది. బీర్‌లో 90 శాతం నీరు ఉంటుందనీ అందుకే అల్ట్రా-క్లీన్ హై-గ్రేడ్ రీసైకిల్ వాటర్‌తో తయారు చేస్తున్నామని కంపెనీ తెలిపింది. సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్‌, వాటర్ కాన్ఫరెన్స్‌లో నేషనల్ వాటర్ ఏజెన్సీ, స్థానిక క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ 'Brewerkz' న్యూబ్రూ ఏప్రిల్ 8న ప్రారంభించింది. నీటి రీసైక్లింగ్, పునర్వినియోగంపై అవగాహన కల్పించేందుకే న్యూబ్రూ సింగపూర్ 'గ్రీనెస్ట్ బీర్'  ఆవిష్కరణ అని  కంపెనీ ఎండీ ర్యాన్ యుయెన్  వెల్లడించారు.

కాగా ప్రపంచవ్యాప్తంగా నీళ్లు, టీ, తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం బీర్‌. వికీపీడియా, ఫార్చ్యూన్ బిజినెస్ ఇన్‌సైట్స్ అందించిన అంచనాల ప్రకారం, 2021లో 768.17 బిలియన్‌ డాలర్లుగా ఉన్న గ్లోబల్ బీర్ మార్కెట్  2028 నాటికి  989.48  బిలియన్ల డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top