కింగ్ చార్లెస్‌-3 ఫొటోతో కొత్త కరెన్సీ నోట్లు.. ఫొటోలు వైరల్..

Bank Of England Unveils First Notes Featuring King Charles III - Sakshi

లండన్‌: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-III ఫొటోలతో కూడిన కొత్త కరెన్సీ నోట్లను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుతం వీటి ముద్రణ జరుగుతోంది. 2024 జూన్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. అయితే చార్లెస్ ఫొటో ఉన్న కొత్త 5, 10, 20, 50 యూరో నోట్లు క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.  ఈయన ఫొటోతో ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు.
దాదాపు 70 ఏళ్లు బ్రిటన్ రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించారు. దీంతో ఆయన కుమారుడు చార్లెస్-3 కొత్త రాజు అయ్యారు. బ్రిటన్‌లో రాజు లేదా రాణి ఫొటోలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తారు.
కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చాక పాత నోట్లు కూడా చెల్లుతాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్పష్టం చేసింది. రాణి ఫొటోలు ఉన్న కరెన్సీ నోట్లు మొత్తం బ్యాంకులకు చేరుకునేందుకు సమయం పడుతుందని చెప్పింది. కొత్త నోట్లపై కింగ్ చార్లెస్ ఫొటో మాత్రమే మారింది. మిగతా డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.
చదవండి: షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు..!

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top