ఢాకా: బంగ్లాదేశ్ కాస్తా.. హత్యా దేశ్‌గా మారుతుందనే విమర్శలు వెల్లువెత్తుతుతున్నాయి. 35 రోజుల్లో 11 మంది హిందువులు దారుణ హత్యకు గురి కాగా.. తాజాగా,మరో హిందువు ప్రాణాలు కోల్పోయాడు.
గుర్తుతెలియని అగంతకులు బాధితుణ్ని వెంటాడి, వేటాడి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించారు. ప్రాణ భయంతో బాధితుడు కెనాల్‌లో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. బంగ్లాదేశ్ నవోగావ్ జిల్లా భండార్పూర్ గ్రామానికి చెందిన మిథున్ సర్కార్‌ను అగంతకులు ప్రాణం తీసేందుకు యత్నించారు. దీంతో భయాందోళనకు గురైన మిథున్ కెనాల్‌లో దూకి ప్రాణాలు కోల్పోయాడు.
2024లో షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, వచ్చే నెలలో సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో బంగ్లాదేశ్‌లోని మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని అగంతకులు ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా మిథున్ సర్కార్ మరణం గత కొన్ని రోజులుగా నివేదించబడిన క్రూరమైన దాడుల శ్రేణిలో తాజాది.


