చెత్త బ్యాగ్‌ రూ.లక్షా 40వేలు.. వైరలవుతోన్న మీమ్స్‌

Balenciaga Sells Trash Bag For Rs 1 Lakh 240 Thousand Netizens S ay This - Sakshi

అంతలేదని కొట్టి పారేస్తున్నారా? అది నిజం. లగ్జరీ బ్రాండ్‌ బలెన్సియాగా ఈ బ్యాగులను తయారు చేసింది. కంపెనీ ‘ట్రాష్‌ పౌచ్‌’గా పిలుస్తున్న ఈ బ్యాగులను దూడ తోలుతో తయారుచేసి.. గ్లాసీ కోటింగ్‌ ఇచ్చింది. నలుపు, తెలుపు, నీలం, పసుపు రంగుల్లో వీటిని తయారు చేసింది. బ్యాగును క్లోజ్‌ చేసేందుకు బ్యాక్‌పాక్‌కు ఉన్నట్టుగా త్రెడ్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. అంతే లగ్జరీగా వింటర్‌–22 కలెక్షన్‌లో విడుదల చేసింది. ఆ వీడియోలు కాస్తా ట్విట్టర్‌లోకి వచ్చాయి. అంతే ఆ ధర చూసి కళ్లు తిరిగిన ట్విట్టర్‌ యూజర్స్‌ మీమ్స్‌తో ఆడుకుంటున్నారు.

కొందరైతే తిట్ల దండకమే మొదలుపెట్టారు. ‘‘చెత్త బ్యాగుకోసం లక్షన్నర ఖర్చు చేయగలిగినవాళ్లకి దాన్నిండా నింపగలిగేంత క్యాష్‌ బ్యాంకులో ఉండే ఉంటుంది. అలా నింపేసి అవసరంలో ఉన్నవారికి చారిటీగా ఇచ్చేయొచ్చు కదా’’ అని ట్వీట్‌ చేశాడో యూజర్‌. ఇక ‘‘ఆ చెత్త బ్యాగ్‌ను తీసుకుని మీరు వెళ్తే... మిమ్మల్ని దోచుకోవడానికి కొంతమందిని పంపిస్తా’’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఇలా లగ్జరీ ఐటమ్స్‌తో వివాదాస్పదం కావడం బలెన్సియాకు కొత్తేం కాదు... ఇదే ఏడాది మేలో ‘రబ్బిష్‌ బిన్‌’ పేరుతో చిరిగిపోయిన షూస్‌ను రూ.2 లక్షల లకు అమ్మి విమర్శలు ఎదుర్కొందీ కంపెనీ.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top