అఫ్గాన్ మదరసాలో పేలుళ్లు... 16 మంది దుర్మరణం

కాబుల్: అఫ్గానిస్తాన్‌లోని ఐబక్ నగరంలోని ఒక మదరసాలో బుధవారం సంభవించిన పేలుళ్లలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయాల పాలయ్యారు. ఈ విషయాన్ని స్థానికంగా వైద్యుడు ఒకరు మీడియాకి వెల్లడించారు. తమ ఆస్పత్రికి చికిత్సకి వచ్చిన వారిలో యువతే అత్యధికంగా ఉన్నారని చెప్పారు.
అల్ జిహాద్ మదరసాలో పేలుళ్లు జరిగినట్టుగా ప్రావిన్షియల్ అధికారి కూడా ధ్రువీకరించారు. గత ఏడాది ఆగస్టులో తాలిబన్లు అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాక యువతీ యువకుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఎక్కువ దాడులకు ఇస్లామిక్ స్టేట్ తనదే బాధ్యతని ప్రకటించుకుంది. ఈ సారి దాడుల పని ఎవరిదో ఇంకా తెలియలేదు.
సంబంధిత వార్తలు