మీది గొప్ప మనసు ...ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు! | Australian Cop Takes In Pet Rooster Of Little Boy Fighting Leukaemia | Sakshi
Sakshi News home page

మీది గొప్ప మనసు ..ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు!

Nov 5 2021 7:26 PM | Updated on Nov 5 2021 9:33 PM

Australian Cop Takes In Pet Rooster Of Little Boy Fighting Leukaemia - Sakshi

ఆస్ట్రేలియా: పోలీసుల అంటేనే చాలామందికి భయంవేస్తుంది. అంతేకాదు పైగా వాళ్లు వృత్తి రీత్యా క్రూరంగా ఉండాల్సి రావడం వల్లనో తెలియదు గానీ చాలా మంది ప్రజలకు పోలీసులపై సదాభిప్రాయం ఉండదు. కానీ ఈ ఆస్ట్రేలియా పోలీసునే చూస్తే కచ్చితంగా అభిప్రాయం మారతుందని చెప్పక తప్పదు.

(చదవండి: బాబోయ్‌! పామును ముద్దులతో ముంచేస్తోందిగా!)

ఇంతకీ అసలు విషయంలోకెళ్లితే....ఆస్రేలియాకి చెందిన ఒక బాలుడు లుకేమియా అనే క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఆ బాలుడు యెప్రాడ్ రూస్టర్‌ అనే కోడిపిల్లను పెంచకుంటున్నాడు. ఆ బాలుడి పెంపుడు కోడిపిల్ల రాత్రిళ్లు విపరీతంగా శబ్దం చేస్తుందంటూ ఇరుగు పోరుగు వాళ్లు పోలీసులు ఫిర్యాదులు చేస్తారు. దీంతో ఆ బాలుడి తండ్రి పోలీసులు ఇంకో పదిరోజుల్లో తమ కొడుకు పెంచుకుంటున్న కోడిపిల్లను తీసుకువెళ్లిపోతారని తెలిసి పోలీసులకు తమ సమస్యను వివరించాలని అనుకుంటాడు.

ఈ క్రమంలో ఫెయిర్‌ఫీల్డ్ సిటీ పోలీస్ ఏరియా కమాండ్‌ అధికారితో ఆ బాలుడు తండ్రి మాట్లాడుతూ...నా కొడుకు లుకేమియాతో బాధపడతున్నాడు. తరుచుగా కీమోథెరఫీ చికిత్సల కారణంగా డల్‌గా అవకూడదనే ఉద్దేశంతోనే రూస్టర్‌ అనే కోడిపిల్లను ఇచ్చాను. పైగా వాడు దానికి జాన్సన్‌ అనే పేరు పెట్టడమే కాక ఆహారం పెడుతూ ఆడుకుంటూ ఉత్సహంగా ఉంటున్నాడు" అని చెబుతాడు.

దీంతో సదరు పోలీస్‌ అధికారి, కానిస్టేబల్‌ ఫ్రాంకీ వారి బాధను అర్థం చేసుకోవడమే కాక మీ కొడుకు ఏమి రూస్టర్‌కి వీడ్కోలు చెప్పాల్సిన అవసరం లేదని చెబురు. పైగా ఆ బాలుడుతో తమకు అందమైన పోలం ఉందని అక్కడ ఈ యెప్రాడ్ రూసర్‌ హాయిగా పెరుగుతుందని అంటారు. అంతేకాదు నీవు ఎప్పుడూ కావల్సి వస్తే అప్పుడు ఈ రూస్టర్‌ని వచ్చి చూడవచ్చు అని ఆ బాలుడికి చెబుతారు. ఈ మేరకు ఆ బాలుడికి బొమ్మలు, పోలీస్‌ యూనిఫాం, టోపి వంటి బహుమతులు కూడా ఇస్తారు. అయితే  ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్‌తో సహా నెటిజన్లంత పోలీసుల దయార్ద్ర హృదయాన్ని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: లాక్‌డౌన్‌లో ప్రజలకు ఎంత జుట్టు పెరిగిందో చెప్పేందుకే..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement