ప‌రస్ప‌ర ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయి : అమెరికా

Australia Joining India, US, Japan In Indo-Pacific For Mega Navy Drill  - Sakshi

వాషింగ్ట‌న్ :  మ‌ల‌బార్ నావికాద‌ళ విన్యాసాల‌లో పొల్గొనేందుకు భార‌త్ ఆస్ర్టేలియాను ఆహ్వానించాల‌ని యోచిస్తోంది. ఈ అంశానికి సంబంధించి రాబోయే రెండు వారాల్లో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.  ఈ నేప‌థ్యంలో క్వాడ్ స‌భ్యుల‌తో పాటు  కాన్బెర్రా పాల్గొనడం వల్ల  ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుందని, ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుకోవ‌చ్చ‌ని అమెరికాకు చెందిన దౌత్య‌వేత్త స్టీవెన్ బీగన్  ఈ వ్యాఖ్య‌లు చేశారు. 1992 లో ప్రారంభ‌మైన వార్షిక నావికాద‌ళ విన్యాసాల్లో భాగంగా భార‌త్, జ‌పాన్, అమెరికా పాల్గొంటుండ‌గా తాజాగా ఆస్ర్టేలియా కూడా ఇందులో పాలుపంచుకోనుంది. కాగా 2015లో జ‌పాన్ ఈ క్వాడ్‌లో శాశ్వత స‌భ్యుదేశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇండో-ప‌సిఫిక్‌లో శాంతి, సుస్థిరిత‌ను నెల‌కొల్పాల‌నే ల‌క్ష్యంతో  క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. (దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ విన్యాసాలు )

 ప్ర‌పంచ వ్యాప్తంగా ఇండో- ప‌సిఫిక్ దేశాల‌తో అమెరికా స‌హ‌కారం ఎప్పుడూ ఉంటుంద‌ని, ఆసియా దేశాల‌తో క‌లిసి ప‌నిచేస్తున్నామ‌ని స్టీవెన్ బీగన్ అన్నారు. 'త‌మ  విధానం నాలుగు స్తంఢాల‌పై నిలుస్తుంది. మొద‌టిది ఐక్య‌త‌, రెండోది మా మిత్ర‌దేశాల‌తో భాగ‌స్వామ్యం, మూడివ‌ది సైనిక నిరోధ‌క‌త‌, చివ‌రిగా నాలుగ‌వ‌ది చైనాకు శ‌క్తివంత‌మైన ఆర్థిక ప్ర‌త్యామ్నాయం' అని స్టీవెన్ బీగన్ వెల్ల‌డించారు.  దక్షిణ చైనా సముద్రం చుట్టుపక్కల ఉన్న ఆయిల్, గ్యాస్​ నిల్వలపై కన్నేసే ఇతర దేశాలతో చైనా గొడవపడుతోందని అమెరికా గతంలో ఆరోపించింది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వల్లో 90 శాతం తనదేననేది చైనా వాదన. దీనిపై బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేసియా, తైవాన్, వియత్నాం దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. తమకూ ఈ సహజ నిల్వలపై హక్కు ఉందంటున్నాయి.  అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కూడా దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా తన ప్రాదేశిక ఆశయాల కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫిలిప్పీన్స్,  థాయ్‌లాండ్ దేశాల‌తో స‌త్సంబంధాలు మ‌రింత బ‌లోపేతం అవుతున్నాయ‌ని   స్టీవెన్ పేర్కొనడం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ('గ్లోబ‌ల్ కామ‌న్స్‌లో ఇది కూడా ఒక భాగమే' )

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top