అరేబియాలో అద్భుతం..! ఈజిప్టు పిరమిడ్‌లకంటే పాతవి..!

Arabia Mustatils Identified As The Earliest Monumental - Sakshi

రియాద్‌: సౌదీ అరేబియాలో పురావస్తుశాఖ వారు అద్భుతమైన నియోలితిక్‌(నవీన శిలా యుగము) క్రీ.పూ.10000-5000) కాలానికి సంబంధించిన కట్టడాలను కనుగొన్నారు. ఈ కట్టడాలు ఈజిప్టులోని పిరమిడ్స్ కంటే చాలా పురాతనమైనవని పురావస్తుశాఖ వారు అంచనా వేస్తున్నారు. వాయువ్య అరేబియాలో 7,000 సంవత్సరాల పురాతన దీర్ఘచతురస్రాకార రాతి నిర్మాణాలపై  పురావస్తు శాఖ చేస్తున్న సర్వేలో పురాతన కాలానికి చెందిన భారీ కట్టడాలను కనుగొన్నారు. ముస్టాటిల్స్ గా పిలుస్తున్న ఈ కట్టడాలను మత విశ్వాసాల కారణంగా నిర్మించారని పురావస్తు శాఖ వారు పేర్కొన్నారు. ఈ కట్టడాలు తొలిసారిగా 1970లో వెలుగులోకి వచ్చినప్పటీకి, ఈ నిర్మాణాలు కొన్ని దశాబ్ధాల పాటు అంతు చిక్కని రహస్యంగా ఉండిపోయాయి.

దీర్ఘచతురస్రంగా పిలిచే అరబిక్‌ పదానికి ముస్టాటిల్స్ గా పేరుపెట్టారు. వీటి నిర్మాణంలో  ప్రతి చివర ఒక వేదికను కలిగి ఉన్నాయి. ఇవి సుమారు 20 నుంచి 620 మీటర్ల వరకు భారీ రాతి నిర్మాణాలను కలిగి ఉన్నాయి. ఈ భారీ రాతి కట్టడాలు సౌదీ అరేబియాలోని అలులా , ఖైబర్ కౌంటీ ప్రాంతాలలో అధిక భాగం ఉన్నాయి.వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం ఈ ప్రాంతంపై సర్వే నిర్వహించింది. ఈ ప్రాంతంపై ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పురావస్తు అధ్యయనం. ఈ పరిశోధనకు రాయల్ కమిషన్ ఫర్ అలులా (ఆర్‌సియు) నిధులు సమకూర్చింది.

ఈ బృందం క్రమబద్ధమైన రిమోట్ సెన్సింగ్ ద్వారా 641 ముస్టాటిల్స్ ను కనుగొన్నారు, ఈ పరిశోధనలను సుమారు 350 వైమానిక సర్వేలను నిర్వహించారు. రెండు లక్షల కిలోమీటర్ల పరిధిలో సుమారు 1,000 కంటే ఎక్కువ ముస్టాటిల్స్ ను కనుగొన్నారు. గతంలో ఉనికిలోకి వచ్చిన వాటికంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ.ఈ కట్టడాల్లో ప్రత్యేకమైన ప్రవేశ మార్గాలు, వ్యవస్థీకృత గదులు, పొడవాటి ప్రాంగణ నిర్మాణాలు ఉన్నాయి. ఈ స్మారక కట్టడాలను నిర్మించడానికి ఈ ప్రాంతంలో నివసించిన  పూర్వ సమాజాల భాగస్వామ్య నమ్మకాలు వీటిని నిర్మించిడానికి దోహదంపడ్డాయని పరిశోధకులు తెలిపారు. ఈ కట్టడాలపై రేడియోకార్బన్ పరీక్షలు నిర్వహించిన తరువాత ,  అవి నియోలిథిక్ కాలంకు చెందినవని కనుగొన్నారు.అంతేకాకుండా ఈ ప్రాంతంలో నిర్వహించిన తవ్వకాల్లో భారీ ఎత్తున పశువుల ఎముకలు లభించాయి. గుర్తు తెలియని దేవుళ్లకు భారీ ఎత్తున పశువుల బలులు జరిగి ఉండవచ్చునని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. 

నార్త్-వెస్ట్ అరేబియాకు చెందిన ఈ  ముస్టాటిల్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి అతి పెద్ద స్మారక కట్టడాలుగా నిలుస్తాయని  ప్రాజెక్ట్  అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మెలిస్సా కెన్నెడీ తెలిపారు. ముస్టాటిల్స్ నియోలిథిక్‌ కాలానికి చెందిన వారి పూర్వీకుల గురించి తెలియజేయడానికి ప్రాదేశిక గుర్తులుగా కూడా పనిచేసి ఉండవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు.

చదవండి: స్వదేశానికి వస్తే ఐదేళ్ల జైలు శిక్ష..!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top