హమాస్‌పై యుద్ధం: ఇజ్రాయెల్‌కు అమెరికా కీలక సూచన | Sakshi
Sakshi News home page

హమాస్‌పై యుద్ధం: ఇజ్రాయెల్‌కు అమెరికా కీలక సూచన

Published Fri, Dec 15 2023 7:48 AM

America Advises Israel To Reduce Intensity Of War On Gaza - Sakshi

జెరూసలెం: గాజాపై రెండు నెలలుగా చేస్తున్న యుద్ధ తీవ్రతను తగ్గించాలని ఇజ్రాయెల్‌కు అమెరికా సూచించింది. ఇక నుంచి గాజాలో సామాన్య పౌరుల ప్రాణాలు పోకుండా చూడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఇజ్రాయెల్‌ వెళ్లిన వైట్‌హౌజ్‌ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ జేక్‌ సుల్లివాన్‌ ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి గల్లాంట్‌, రక్షణశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు.

‘నేను ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూతోనూ మాట్లాడాను. గాజాపై యుద్ధ తీవ్రతను తగ్గించి ఉగ్రవాదులు టార్గెట్‌గా మాత్రమే దాడులు చేయాలని చెప్పాను. సామాన్య పారుల ప్రాణాలు కాపాడాలని కోరాను. అయితే ఇజ్రాయెల్‌ ఎప్పటి నుంచో ఇది మొదలు పెడుతుందో చెప్పలేను. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు మాత్రం మరింత కాలం కొనసాగుతాయి’అని సుల్లివాన్‌ ఇజ్రాయెల్‌ మీడియాకు తెలిపారు.

తన పర్యటనలో భాగంగా శుక్రవారం రమల్లా వెళ్లనున్న వైట్‌హౌజ్‌ సెక్యూరిటీ సలహాదారుసుల్లివాన్‌ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌తోనూ చర్చలు జరుపుతారు. పాలస్తీనా అథారిటీని ప్రక్షాళన చేసి కొత్తరూపు తీసుకువచ్చే విషయంపై వీరి మధ్య చర్చలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. 

ఇదీచదవండి..వెనెజులాలో ట్రక్కు బీభత్సం.. 16 మంది మృతి

Advertisement
Advertisement