ట్రంప్‌ నిర్ణయం; 293 మంది అమెరికన్ల మృతి

In America 293 Citizens Died Because Of Using Hydroxychloroquine - Sakshi

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారికి హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ మంచి జౌషధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చాలా గట్టిగా వాదించారు. అంతేకాకుండా భారత్‌ నుంచి కూడా అధిక మొత్తంలో దానిని దిగుమతి చేసుకున్నారు. హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ వల్ల ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 293 మంది అమెరికన్‌లు చనిపోయారని ‘మిల్వాకీ జర్నల్ సెంటినెల్’ అధ్యయనంలో వెల్లడైంది. ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) వెల్లడించిన సైడ్‌ ఎఫెక్ట్స్‌ వల్ల చనిపోయినవారి సంఖ్య ఆధారంగా ఈ అధ్యయం చేసింది. చాలా మంది వైద్యనిపుణులు హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ చాలా ఉన్నాయని హెచ్చరించారు. అయినప్పటికీ ట్రంప్‌ ఈ డ్రగ్స్‌ వాడటం వల్ల కోల్పోయేది ఏం ఉండదు అని ప్రకటించారు. దాంతో అందరూ వాడటం మొదలు పెట్టారు. 

సాధారణంగా మలేరియా చికిత్సలో వాడే ఈ మందును గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉండే వారు ఉపయోగించరు. అయితే ట్రంప్‌ ఈ డ్రగ్‌ను వాడటానికి అనుమతినివ్వడంతో డాక్టర్లు కూడా తమ పేషెంట్‌కు ఈ మందును వాడొచ్చని చెప్పారు. దీంతో మార్చి నెలలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ వినియోగం ఒక్కసారిగా 2000 శాతం పెరిగింది. ఈ డ్రగ్‌ వాడటం వలన 2019లో 75 మంది చనిపోతే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అంతకు రెట్టింపు 293 మంది మరణించారు. హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ డ్రగ్‌ వల్ల ఇంకా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.  

చదవండి: అమెరికా అధ్యక్షుడికి ఫేస్‌బుక్‌ షాక్‌ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top