Alligator Attacks On Man Swimming In Lake And Bites His Arm, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: భయానక దృశ్యం.. చెరువులో ఈత కొడుతుండగా దాడి చేసిన మొసలి

Dec 3 2022 3:47 PM | Updated on Dec 3 2022 4:02 PM

Alligator Attacks Man Swimming In Lake Bites His Arm Video Viral - Sakshi

చెరువులో ఈత కొడుతుండగా ఒక్కసారిగా ఓ భారీ మొసలి(ఎలిగేటర్‌) అతడిపై దాడి చేసింది.

నీటిలో దిగినప్పుడు చిన్న పురుగు కనిపించినా భయంతో ఒడ్డుకు చేరతాం. అలాంటిది భారీ ఆకారంతో మొసలి దాడి చేస్తే.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనవుతుంది. అలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది. చెరువులో ఈత కొడుతుండగా ఒక్కసారిగా ఓ భారీ మొసలి(ఎలిగేటర్‌) అతడిపై దాడి చేసింది. చేతిని పట్టి లాగింది. అయితే, దాని నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరాడు ఆ వ్యక్తి. స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోను ‘ద సన్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో 2021లో పోస్ట్ చేయగా.. 52 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. 

ఈ సంఘటన బ్రెజిల్‌లో జరిగింది. చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి వైపు వేగంగా దూసుకొచ్చిన మొసలి అతని చేతిని పట్టి లాగేందుకు యత్నించింది. ఒడ్డుకు వేగంగా ఈదేందుకు బాధితుడు ప్రయత్నించగా చేతిని కరిచింది. దాని నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఒడ్డుకు చేరుకున్నాక తన చేతిని పరిశీలించి చూడగా.. రక్తం కారుతూ కనిపించింది.

ఇదీ చదవండి: మెట్లపై నుంచి పడిపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement