Afghanistan: జెండా ఎగరేసిన నిరసనకారులు, కాల్పుల మోత

 Afghanistan: Taliban fires at protesters in Jalalabad city - Sakshi

కాబూల్‌: అఫ్గన్‌ను హస్తగతం చేసు​కున్న తాలిబన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. నిరసనల సెగతో అఫ్గన్‌లో చాలా ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. తమ హక్కుల కోసం ప్రజలు రోడ్డెక్కారు.  అఫ్గన్‌ జెండాలతో  వీధుల్లో కదం దొక్కారు. ఈ క్రమంలో జలాలాబాద్‌లో తాలిబన్ జెండాను  తీసేసి అఫ్గన్‌ జెండాను ఎగురవేశారు. ఈ ఘటన కాల్పులకు దారితీసింది. 

జలాలాబాద్‌లో నిరసనకారులపై తాలిబన్ల కాల్పుల ఘటన ఉద్రిక‍్తతను రాజేసింది. అఫ్గన్‌ జెండాఎగరేసిన ఆందోళలకారులపై బుధవారం జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. 10 మందికిపైగా గాయపడ్డారు.  దీంతో పరిస్థితి  ఉద్రిక్తంగా మారింది. మరోవైపు తాలిబన్లు  ప్రజలు కాల్పులపై  జరిపినా, దాడుల చేసినప్పటికీ ఖోస్ట్‌లో ప్రజలు జాతీయ జెండానుఎగురవేయడం విశేషం. అఫ్గన్‌లు తమ జెండా కోసం, తమ గుర్తింపుకోసం చావడానికైనా సిద్ధమన్నట్టుగా ప్రతిఘటనకు దిగారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అటు కాబూల్‌లోని వజీర్ అక్బర్ ఖాన్‌లో, నలుపు, ఆకుపచ్చ హిజాబ్‌లు ధరించిన నలుగురు మహిళలు  తమకూ సమాన హక్కులు, రాజకీయాలలో  భాగస్వామ‍్యం కల్పించాలని  డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top