ఆక్స్‌ఫర్డ్‌ ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ లేదు

2020 has too many Words of the Year to name just one - Sakshi

లండన్‌: ఏటా ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్‌ డిక్షనరీ ఏదో ఒక పదాన్ని వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ప్రకటిస్తుంది. సాధారణంగా సంవత్సరమంతటా ప్రాచుర్యం పొంది, ప్రజల నోళ్లలో నానిన పదాన్ని వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ప్రకటిస్తుంది. అయితే ఈ ఏడాది అందుకు భిన్నం. ఈ ఏడాది భాష చాలా అభివృద్ధి చెందిందని చెప్పింది. దీనికి కారణం కరోనా వైరస్‌. ఈ పదం కారణంగా కోవిడ్, లాక్‌డౌన్, సోషల్‌ డిస్టన్స్, రీఓపెనింగ్‌ వంటి పదాలు విరివిగా వాడుకలోకి వచ్చాయి.

దీంతో ఒకే పదాన్ని ఈ ఏడాది వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ప్రకటించలేమని చెప్పింది.  నెలల వారీగా చూస్తే పలు పదాలు బాగా ప్రాచుర్యం పొందాయి. జనవరిలో బుష్‌ఫైర్, ఫిబ్రవరిలో అక్విట్టల్, మార్చి నుంచి మే వరకు కోవిడ్‌–19, లాక్‌డౌన్, సోషల్‌ డిస్టెన్సింగ్, రీఓపెనింగ్‌ వంటి పదాలు ముందు వరుసలో నిలిచాయి. జూన్‌లో బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్, ఆగస్టులో మెయిల్‌–ఇన్, బెలాసరుసియన్, సెప్టెంబర్‌లో నెట్‌ జీరో, అక్టోబర్‌లో సూపర్‌ స్ప్రెడర్‌ పదాలు ప్రాచుర్యం పొందాయి.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top