
ఫ్రీడమ్ వేరుశనగ నూనె సరికొత్త ప్యాక్ ఆవిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా నవీకరించిన ఫ్రీడమ్ వేరుశనగ నూనె ప్యాక్‌ను బుధవారం ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖరరెడ్డి ఆవిష్కరించారు. సంప్రదాయ భారతీయ ఊరగాయ, పచ్చళ్లు, ఇతర వంటకాలకు అవసరమైన ఆరోగ్యకర కుకింగ్ ఆయిల్ కలెక్షన్‌ను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఫ్రీడమ్ వేరుశనగ నూనె గింజ రుచిని కలిగి ఉంటుందని, వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో సంప్రదాయ రుచి, సువాసనతో ఊరగాయలు, పచ్చళ్లు తయారు చేయడానికి ప్రాధాన్యతనిస్తారన్నారు. వీని అభిరుచికి తగిన ‘ఫ్రీడమ్ వేరుశనగ నూనె ప్యాక్’ను పరిచయం చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జెమినీ ఎడిబుల్స్–ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ చేతన్ పింపాల్టే తదితరులు పాల్గొన్నారు.