
ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తిపై కేసు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని సర్వే నెంబర్ 403/పీ షేక్‌పేట విలేజ్ డీపంక్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ మున్సిపాలిటీ ప్లాట్ నెంబర్ 85, 86లలో ఉన్న 286 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తిపై షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలివీ..బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లో ఖరీదైన 286 గజాల ప్రభుత్వ స్థలాన్ని గుంటి శ్రీధర్‌రావు అనే వ్యక్తి ఆక్రమించి మెటీరియల్ డంప్ చేయడమే కాకుండా ఇనుపరాడ్లు, జేసీబీలను ఇందులో దింపాడు. సమాచారం అందుకున్న షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, మండల సిబ్బంది కబ్జా స్థలాన్ని చేరుకుని నిర్మాణాలను నిలిపివేశాడు. సామగ్రితో పాటు జేసీబీని సీజ్ చేశారు. ఈ మేరకు పోలీసులకు కబ్జా చేసిన గుంటి శ్రీధర్‌రావుతో పాటు కాంట్రాక్టర్ నర్సింగరావుపై ఫిర్యాదు చేయగా పోలీసులు వీరిపై బీఎన్‌ఎస్ 329 (3), 324 (3), 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన ప్లాట్‌ను ఆనుకుని శ్రీధర్‌రావు ప్రభుత్వ స్థలంలోకి చొచ్చుకువచ్చి బండరాళ్లను పగులగొట్టడమే కాకుండా ఇందులో నిబంధనలకు విరుద్ధంగా షెడ్లు నిర్మించేందుకు ప్రయత్నించచారన్నారు. సుమారు రూ.9 కోట్ల విలువైన ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సిబ్బందితో కలిసి అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
‘ఆపరేషన్ ధూల్‌పేట’ సక్సెస్
సాక్షి, సిటీబ్యూరో: గంజాయి, డ్రగ్స్ నియంత్రణలో భాగంగా ఎకై ్సజ్ అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్ ధూల్‌పేట్’ కొనసాగుతోంది. ఇప్పటి వరకు గడిచిన 250 రోజుల్లో 102 కేసుల్లో 425 మందిని నిందితులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారిలో 327 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. 13 మందిని బైండోవర్ చేశారు. మరో 85 మంది నిందితులు పరారీలో ఉన్నారు. మొత్తం 401 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే 147 సెల్‌ఫోన్‌లు, 58 బైక్‌లు, 2 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా, ఏపీ, తదితర రాష్ట్రాల నుంచి నగరానికి గంజాయి సరఫరా చేసే ముఠాలపైన నిఘాను కఠినతరం చేశారు. అలాగే పీడీ యాక్ట్‌లతో పాటు, పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. ఎకై ్సజ్ అధికారులకు చిక్కకుండా తప్పించుకొంటున్న లేడీడాన్‌ల ఆటకట్టించినట్లు చెప్పారు. గత సంవత్సరం జూలై 17వ తేదీన ఎకై ్సజ్‌శాఖ ఆపరేషన్ ధూల్‌పేట్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు సాధించిన ఫలితాలను దృష్టిలో ఉంచుకొని నగరమంతటా ఇదే తరహాలో దాడులు, తనిఖీలను ఉధృతం చేసేందుకు ఎకై ్సజ్‌శాఖ ప్రణాళికలను రూపొందించింది. ప్రస్తుతం ధూల్‌పేట్‌లో 90 శాతం గంజాయి అమ్మకాలు తగ్గాయని, పూర్తిగా నిర్మూలించే వరకు దాడులను కొనసాగిస్తామని ఎకై ్సజ్‌శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి తెలిపారు.
● గంజాయి నియంత్రణకు పకడ్బందీ చర్యలు
● 250 రోజుల్లో 102 కేసులు
● 401 కిలోల గంజాయి స్వాధీనం
● 425 మందిపైన కేసులు నమోదు