బిగ్‌బాస్‌ గొడవలో మరో ముగ్గురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ గొడవలో మరో ముగ్గురి అరెస్టు

Dec 25 2023 6:38 AM | Updated on Dec 25 2023 8:16 AM

- - Sakshi

హైదరాబాద్: బిగ్‌బాస్‌ గొడవలో జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆదివారం మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 17న అన్నపూర్ణ స్టూడియోస్‌లో బిగ్‌బాస్‌ ఫైనల్స్‌ అనంతరం విజేత ప్రశాంత్‌, రన్నరప్‌ అమర్‌దీప్‌చౌదరి అభిమానులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడి బస్సులు, కార్లను ధ్వంసం చేసి పోలీసులపై రాళ్లు రువ్వి విధ్వంసానికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌ అతడి సోదరుడు మహావీరంలను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించగా శనివారం వీరిద్దరూ బెయిల్‌పై వచ్చారు. అలాగే ఈ విధ్వంసానికి పాల్పడిన 12 మందిని అరెస్ట్‌ చేసి ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. తాజాగా సరూర్‌నగర్‌కు చెందిన హరినాథ్‌రెడ్డి, యూసుఫ్‌గూడలకు చెందిన ఎం. సుధాకర్‌లను ఆదివారం రిమాండ్‌కు తరలించారు. పవన్‌ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement