ప్రతీ కుటుంబానికి బీమా భద్రత | - | Sakshi
Sakshi News home page

ప్రతీ కుటుంబానికి బీమా భద్రత

Nov 14 2026 1:35 AM | Updated on Nov 14 2026 1:35 AM

● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హన్మకొండ అర్బన్‌/న్యూశాయంపేట: రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించడమే లక్ష్యంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఐడీఓసీ నుంచి పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్‌ 19న సీఎం రేవంత్‌ ఈపథకాన్ని ప్రారంభిస్తారని, అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ బి.శేషాద్రి, వరంగల్‌ నుంచి కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, జెడ్పీ సీఈఓ వసంత, డీఆర్‌డీఓ నాగపద్మజ, డీపీఓ కల్పన, అధికారులు పాల్గొన్నారు. డీఆ ర్డీఓ, సీపీఓ తదితర అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ పంటలపై

అవగాహన కల్పించాలి

రబీ 2026–27 సీజన్‌లో ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేనందున వరి సాగును నివారించి, ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్‌, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వ్యవసాయం, విద్య, భూసేకరణ, వీధి కుక్కల నియంత్రణ, గ్రామీణాభివృద్ధి పనుల పురోగతిపై వీడియో కాన్ఫన్స్‌ నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్‌ నుంచి చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మౌలిక వసతుల పెంపుపై దృష్టి సారించడం వల్ల ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు. దీనిపై సీఎస్‌ కలెక్టర్‌ను అభినందించారు. వీసీలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్‌ గౌడ్‌, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి గోపాల్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement