కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నిరసన | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నిరసన

Nov 14 2026 1:35 AM | Updated on Nov 14 2026 1:35 AM

కేయూ క్యాంపస్‌: యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్‌ చేశాకే అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియమకాలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు శుక్రవారం చాక్‌డౌన్‌ చేసి తమ విభాగాలు, వర్సిటీ కాలేజీల్లో తరగతులు బోధించకుండా నిరసన వ్యక్తం చేశారు. క్యాంపస్‌లోని పరిపాలనాభవనం వద్ద నిరసన తెలిపారు. గత సంవత్సరం సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పరిపాలనాభవనంలో కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య రామచంద్రంతో సమావేశమై పలు అంశాలపై మాట్లాడారు. తమను రెగ్యులరైజ్‌ చేస్తారని నమ్మకంతో ఎన్నో ఏళ్లనుంచి కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. యూనివర్సిటీల్లో విద్యాబోధన చేస్తున్న తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నూతన నియమకాలను ప్రభుత్వం చేపట్టబోతున్నందున వెంటనే తమను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేగా కుండా ఉద్యోగ భద్రతతో కూడిన యూజీసీ పేస్కేల్స్‌ను అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. కేయూ పాలకమండలిలో కూడా తమ సమస్యను ఏజెండాలో పెట్టి చర్చించాలని మా సమస్యను పరిష్కరించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రిజిస్ట్రార్‌ రామచంద్రానికి అందజేశారు. నిరసనలో కేయూ కాంట్రాక్టు ప్రొఫెసర్ల జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ కరుణాకర్‌రావు, టీ ఆక్టా సెక్రటరీ డాక్టర్‌ శ్రీధర్‌కుమార్‌లోథ్‌, కేయూ జేఏసీ కన్వీనర్‌ డాక్టర్‌ సాదు రాజేష్‌, బాధ్యులు సతీష్‌, బైరి నింరజన్‌, రంగారెడ్డి, నాగేశ్వర్‌రావు, చంద్రశేఖర్‌, సూర్యనారాయణ, అరూరి సూర్యం, స్వామి, ప్రవీన్‌, నాగయ్య, వెంకటేష్‌, రాధిక, సాహితి, ప్రణీత, కవిత, భాగ్య, రమ, ప్రియాంక, బెస్సీ తదితరులు పాల్గొన్నారు.

కేయూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement