కాజీపేట రూరల్: కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ పర్యవేక్షణలో పండుగల సీజన్లను దృష్టిలో ఉంచుకుని కాజీపేట, వరంగల్‌లో 150 ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ కల్పించినట్లు వివరించారు. ప్లాట్‌ఫాంలు, వెయిటింగ్ హాళ్లు, టాయ్లెట్స్లు, టిక్కెట్ బుకింగ్ కౌంటర్లు, ఇతర ప్రదేశాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణకుల రాకపోకలు, సజావుగా క్రమబద్దంగా సాగేందుకు రద్దీని నియంత్రించేందుకు టిక్కెట్ తనిఖీ సిబ్బంది, ఆర్పీఎఫ్ ఫోర్స్‌ను నియమించినట్లు తెలిపారు. ఆటోమెటిక్ టికెట్ మిషన్లు, క్యూ ఆర్ కోడ్లు, రైల్వే టిక్కెట్ యాప్‌లను ప్రదర్శించి సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. రైళ్ల వివరాలు, నంబర్లు, కోచ్‌ల స్థానాల వివరాలను ఎప్పటికప్పుడు మెగా ఫోన్ల ద్వారా ప్రకటిస్తున్నట్లు వివరించారు. ఈ నెల చివరి వరకు పండుగ సీజన్లను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు కావాల్సిన సదుపాయాలను బలోపేతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాజీపేట, వరంగల్‌లో 150 ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్
ఆయా స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం


