కాజీపేట: పదేళ్ల కాలంలో గత పాలకులు చేయని అభివృద్ధి పనులను మూడేళ్లలో చేశామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. 61, 63వ డివిజన్లలో రూ.2.33 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పలు సీసీ రోడ్డులు, సైడ్ డ్రెయినేజీ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అతి త్వరలో అండర్ డ్రెయినేజీ పనులను చేపట్టడంతో పాటు దాదాపు 40 ఏళ్ల వరకు జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్తగా తాగునీటి పైపులైన్లను మార్చనున్నట్లు తెలిపారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అజీజ్‌ఖాన్, బైరి రవికృష్ణ గౌడ్, జి.రమాకాంత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు విజయశ్రీ రజాలీ, గుంటి కుమారస్వామి, సుంచు కృష్ణ, ఎండి అంకూస్, అరూరి సాంబయ్య, క్రాంతిభరత్, కొండా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి


