హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: ప్రభుత్వానికి బకాయి ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఈనెల 30వ తేదీలోగా అందజేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్.. డీఫాల్ట్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా పౌర సరఫరాల అధికారి మహేందర్, ఇతర అధికారులతో పాటు సీఎంఆర్ బకాయిలు పూర్తిగా పెండింగ్‌లో ఉన్న రైస్‌మిల్లర్లు, జరిమానా బకాయిలున్న మిల్లర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గడువులోగా సీఎంఆర్ అందించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ సిబ్బంది నాగేంద్రప్రసాద్, భద్రునాయక్, ఇతర అధికారులు, రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు.


