నయీంనగర్: హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద ఉన్న సెంట్రల్ లైబ్రరీ వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రదాతగా నిలుస్తోంది. విద్యార్థులకు, పాఠకులకు వేల సంఖ్యలో పుస్తకాలు అందిస్తూ సేవలందిస్తోంది. 1958లో స్థాపితమైన ఈ లైబ్రరీ అంచంచెలుగా ఎదుగుతూ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లా నిరుద్యోగులకు, విద్యార్థులకు, పాఠకులు అడిగిన పుస్తకాలు ఇస్తూ సేవలందిస్తోంది. అన్ని విభాగాల్లో కలిపి 70 వేల పుస్తకాలు ఈ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. పాఠకులకు రూ. 5 భోజనం, ఇంటర్నెట్ వైఫై, రీడింగ్ చైర్, రీడింగ్ ప్యాడ్లు కూడా ఈ లైబ్రరీ అందిస్తోంది. నేటి (శనివారం) నుంచి గ్రంథాలయాల వారోత్సవాల సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
సెంట్రల్ లైబ్రరీలో
మెరుగైన వసతులు
ఆర్ఓ వాటర్, ఇంటర్నెట్, రూ.5కే భోజనం..
వినియోగించుకుంటూ ఉద్యోగాలు సాధిస్తున్న యువత


