● క్రైం ఏసీపీ సదయ్య
కాశిబుగ్గ: విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వరంగల్ క్రైం ఏసీపీ సదయ్య అన్నారు. గురువారం వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో యాంటీ ర్యాగింగ్, మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళాశాలలో విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని, మహిళల భద్రతకు ప్రతీ ఒక్కరు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మహిళల భద్రతకు టీ–సేఫ్ యాప్ ఉపయోగపడుతుందని, దీని ద్వారా మహిళలు తమ భద్రతను ఎలా పొందవచ్చొ వివరించారు. కేఎంసీ ప్రిన్సిపాల్ దివ్వెల మో హన్‌దాస్ మా ట్లాడుతూ కేఎంసీలో ర్యాగింగ్ పూర్తిగా నిషేధమన్నారు. విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో విద్యనభ్యసించాలన్నారు. మట్టెవాడ సీఐ నడిపల్లి కరుణాకర్, పోలీసు సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘షీ’ టీం ఎస్సై రావేళ్ల రామారావు యాంటీ ర్యాగింగ్, మహిళల భద్రతపై ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి.


