లాలాపేట: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్, వరంగల్, జనగామ జిల్లాల ఉద్యమకారులు గురువారం తార్నాకలోని గుర్తింపు కమిటీ సభ్యుడు మోతె శోభన్‌రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. 1969, 2009 ఉద్యమకారులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని, హైకోర్టు ఆదేశించి ఎనిమిది నెలలైనా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చకపోతే కమిటీ సభ్యులందరి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించి, శోభన్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. ఓయూ పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. దీనిపై స్పందించిన శోభన్‌రెడ్డి, ఉద్యమకారుల దరఖాస్తుల స్వీకరణకు వెబ్సైట్ సిద్ధమైందని తెలిపారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా దీనిని ప్రారంభించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ ఆవేశపూరిత చర్యలకు పాల్పడొద్దని కోరారు.
22న హనుమకొండలో
కేటీఆర్ సభ
హన్మకొండ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ఏకశిల విద్యా సంస్థల చైర్మన్ తిరుపతి రెడ్డి బీఆర్ఎస్లో చేరుతు న్న సందర్భంగా ఈ నెల 22న హనుమకొండ కేడీసీ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభ విజ య వంతంపై హనుమకొండ రాంనగర్‌లోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వగృహంలో పా ర్టీ ముఖ్య నాయకుల సమీక్ష నిర్వహించారు. ఈ స మావేశంలో కేటీఆర్ సభ విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఉ మ్మడి వరంగల్ జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు ఈ సభ విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజ య్య, చల్ల ధర్మా రెడ్డి, నన్నపునేని నరేందర్, ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, ఏకశిల విద్యా సంస్థల చైర్మన్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
కాజీపేట మీదుగా శబరిమల ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : శబరిమల పుణ్యక్షేత్రం వెళ్లే అయ్యప్ప మాలధారుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా చర్లపల్లి–కొల్లం–చర్లపల్లి మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
డిసెంబర్ 30వ తేదీ, 2027 జనవరి 6, 13వ తేదీల్లో (బుధవారం) బయలుదేరే చర్లపల్లి–కొల్లం (07199) శబరిమల ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా 2027, జనవరి 1,8,15వ తేదీల్లో (శుక్రవారం) బయలుదేరే కొల్లం–చర్లపల్లి (07200) శబరిమల ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప మాలధారులకు ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో ఉపయోగపడుతాయి. కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడలో హాల్టింగ్ కల్పించారు.
కాజీపేట మీదుగా వన్‌వే స్పెషల్ ట్రైన్..
కాజీపేట జంక్షన్ మీదుగా బరౌని–ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య వన్‌వే స్పెషల్ ట్రైన్ నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు.
ట్రైన్ వివరాలు..
నవంబర్ 20వ తేదీన బరౌనిలో బయలుదేరే బరౌని–ఎస్ఎంవీటీ బెంగళూరు (05250) ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు కాజీపేటకు చేరుకుని వెళ్తుంది.
● ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతె శోభన్‌రెడ్డి నివాసం ముట్టడి


