క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించాలి

Nov 12 2026 5:24 AM | Updated on Nov 12 2026 5:24 AM

ఖిలా వరంగల్‌ : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో వైద్య సహాయం అందించి ప్రాణాలు కాపాడాలని వరంగల్‌ రవాణాశాఖ అ ఽధికారి(డీటీఓ) రంగారావు సూచించారు. బుధవారం వరంగల్‌ రవాణాశాఖ కార్యాలయ ప్రాంగణంలో సీనియర్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ) శోభన్‌కుమార్‌ ఆధ్వర్యంలో పీఎం–రహత్‌, పీఎం–రహవీర్‌ పథకాలపై వాహనదారులకు అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీటీఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించడమే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం–రహత్‌, పీఎం– రహవీర్‌ పథకాల ప్రధాన లక్ష్యమన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలి నుంచి హాస్పిటల్‌కు తరలించడం ద్వారా ప్రాణాలు కాపాడొచ్చని తెలిపారు. క్షతగాత్రులకు సహాయం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. ఏఎంవీఐ ఉదయ్‌కుమార్‌, ఎన్‌ఐఎస్‌యూ నుంచి మహేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కాజీపేట, వరంగల్‌

మీదుగా ప్రత్యేక రైళ్లు

కాజీపేట రూరల్‌: ప్రయాణికుల సౌకర్యార్థం కాజీ పేట, వరంగల్‌ రైల్వే స్టేషన్ల మీదుగా గయా–ఎంజీ ఆర్‌ చైన్నె సెంట్రల్‌, ఎస్‌ఎంవీటీ బెంగళూరు–బ రౌని మధ్య ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మ ధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ బుధవారం తెలిపారు.

కాజీపేట మీదుగా ..

ఈ నెల 9నుంచి 30వ తేదీ వరకు ప్రతీ సోమవారం బయలుదేరే ఎస్‌ఎంవీటీ బెంగళూరు–బరౌని (06587) 4 ఎక్స్‌ప్రెస్‌లు మరుసటి రోజు కాజీపేటకు చేరుకుని వెళ్తాయి. ఈ నెల 12 నుంచి డిసెంబర్‌ 3వ తేదీ వరకు ప్రతీ మంగళవారం బరౌని–బెంగళూరు కాంట్‌ (06588) 4 ఎక్స్‌ప్రెస్‌లు మరుసటి రోజు కాజీపేటకు చేరుకుని వెళ్తాయి. ఈ రైళ్లకు సికింద్రాబాద్‌, కాజీపేట, బల్లార్షా, నాగ్‌పూర్‌లో హాల్టింగ్‌ కల్పించారు.

వరంగల్‌ మీదుగా..

ఈ నెల 17న బయలుదేరే గయా–ఎంజీఆర్‌ చైన్నె సెంట్రల్‌ (03689) ఎక్స్‌ప్రెస్‌ మరుసటి రోజు వరంగల్‌కు చేరుకుని వెళ్తుంది. ఈ రైలుకు బల్లార్షా, వరంగల్‌, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు స్టేషన్‌లో హాల్టింగ్‌ కల్పించారు.

కలెక్టర్‌ను కలిసిన

ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌

హన్మకొండ అర్బన్‌ : కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ని బుధవారం ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ ఎం.పవన్‌ మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియంలో డిసెంబర్‌లో జరుగనున్న ఖేల్‌ ఇండియా యూత్‌ గేమ్స్‌ పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వం నియమించగా జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టర్‌ను కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement