ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుదాం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుదాం

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుదాం

● బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి

హన్మకొండ: పట్టభద్రులను, నిరుద్యోగులను వంచించిన కాంగ్రెస్‌కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెబుదామని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్‌, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.గౌతంరావు పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ హంటర్‌ రోడ్డులోని సత్యం కన్వెన్షన్‌లో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచక శక్తులను తరిమికొడతాం’ నినాదంతో బీజేపీ త్వరలో మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్‌ వైఫల్యాలను, వారి ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని శ్రేణులకు సూచించారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌ రెడ్డి, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌, నాయకులు కొండపల్లి శ్రీధర్‌ రెడ్డి, మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్‌, వన్నాల శ్రీరాములు, డాక్టర్‌ టి.రాజేశ్వర్‌ రావు, గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, రావు పద్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement