కాజీపేట: మద్యం మత్తులో ప్రైవేట్ స్కూల్ బస్సు నడుపుతూ పట్టుబడిన డ్రైవర్‌కు కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఆరుగురు మైనర్లకు ఒకరోజు జువైనల్ హోంకు పంపుతూ న్యాయస్థానం ఆదేశించింది. కాజీపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 14 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో మద్యం సేవించి ప్రైవేట్ స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్‌ను కోర్టులో హాజరుపర్చగా రెండో తరగతి మెజిస్ట్రేట్ రాజశేఖర్‌రెడ్డి ఐదురోజుల జైలు శిక్ష విధించారు. దీంతో అతడిని పరకాల సబ్ జైలుకు తరలించారు. అదేవిధంగా.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఆరుగురు మైనర్లను జువైనల్ కోర్టులో హాజరుపర్చగా.. మేజిస్ట్రేట్ ఎండీ ఫారియా ఒకరోజు జువైనల్ హోంకు పంపించారు.
జువైనల్ హోమ్‌కు ఆరుగురు మైనర్లు


