కేయూ క్యాంపస్: కేయూ భూముల పరిరక్షణకు సమగ్ర సర్వే నిర్వహించాలని బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తరఫున బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవిని కలిసి వినతి పత్రం అందించారు.
పేద విద్యార్థులకు అండగా కేంద్ర మంత్రి
హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ హైస్కూల్స్‌లో టెన్త్ చదువుతున్న పేద విద్యార్థులు 463 మందికి సంబంధించిన పరీక్ష ఫీజు రూ.57,875ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెల్లించినట్లు బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను అదనపు కలెక్టర్ రవికి తెలియజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో భీమదేవరపల్లి సర్పంచ్, సిద్ధిపేట జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి, ఆ మండల పార్టీ అధ్యక్షు డు శ్రీరామోజు శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రుత్విక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


