కేయూ క్యాంపస్: శాస్త్రవేత్తలుగా ఆలో చించాలని ప్రయోగాల పరిశీలన, ధ్రువీకరించిన పరిజ్ఞానం ఆధారంగా స్టార్టప్‌లను అభివృద్ధి చేయాలని హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూరాలజీ వ్యవస్థాపకుడు విశాల్‌రెడ్డి సూచించారు. కాకతీయ యూనివర్సిటీలోని కే హబ్, హైదరాబాద్‌లోని టీ హబ్ సౌజన్యంతో విద్యార్థుల్లో స్టార్టప్ ఆలోచనలు, నూతన ఆవి ష్కరణలు, వ్యాపార నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఐడియా టు ప్రోటోటైప్ అంశంపై విద్యార్థులకు శుక్రవారం కేయూలోని సెనెట్ హాల్‌లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విశాల్‌రెడ్డి మాట్లాడుతూ.. స్టార్టప్‌లు కూడా జీవుల మాదిరిగా నే నిరంతరం అభివృద్ధి చెందుతూ మార్పులకు అనుగుణంగా ఎదుగుతాయని తెలిపారు. వ్యాపార ఆలోచనలకు విజయవంతమైన ఎంట్రప్రెన్యూరాల జీ ఒక క్రమబద్ధమైన విధానమని వివరించారు. కె హబ్ డైరెక్టర్ ఆచార్య సవితాజ్యోత్స్న, రూసా నోడల్ అధికారి ఆచార్య మల్లికార్జున్‌రెడ్డి, కెహబ్ కోఆర్డినేటర్లు కిరణ్‌కుమార్, సిద్దార్థ పాల్గొన్నారు.
● ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సరిత
హన్మకొండ అర్బన్: జిల్లాలో పీసీపీఏడీటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రజిత అన్నారు. శుక్రవారం హనుమకొండలోని పలు స్కానింగ్ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా కేంద్రాల్లో చట్టం అమలవుతున్న తీరును పరిశీలించి, సంబంధిత రికార్డులు, రిజిస్టర్లు, స్కానింగ్ వివరాలు, అనుమతి పత్రాలను తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతీ స్కానింగ్ కేంద్రం పీసీపీఏడీటీ చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో పర్యవేక్షకురాలు పద్మజ తదితరులు పాల్గొన్నారు.
స్వల్పంగా పెరిగిన పత్తి ధర
ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. ప్రభుత్వం మద్దతు ధర రూ.8,667 ఉండగా. గరిష్టంగా రూ.8750 ధర పలికింది. మక్కకు మద్దతు ధర రూ.2410 ఉండగా.. రూ.3175 ధర లభించింది. దేశీ మిర్చికి జెండా పాటలో రూ.43 వేల ధర పలికింది. పంటలకు ఆశాజనక ధరలు లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
దరఖాస్తుల ఆహ్వానం
కాళోజీ సెంటర్: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యాంగుల అభ్యున్నతి, సాధికారత కోసం విశేష కృషిచేసిన ఉత్తమ వ్యక్తులు, సంస్థలకు రాష్ట్రస్థాయి పురస్కారాలు అందించనున్నటు వరంగల్ జిల్లా సంక్షేమాధి కారి రాజమణి తెలిపారు. ఈ పురస్కారాలకు అర్హులైన వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. దరఖాస్తు వి ధానం, పూర్తి వివరాలకు https://depwdsctgp. telangana. gov. in Ððl-»Œæ-OòÜ-sŒæ-ÌZ ^èl*yé-ÌS° çÜ*_…^éÆý‡$. AÆý‡$á-Ë$ ™èlW¯]l {«§ýl$ÒMýS-Æý‡-׿ ç³{™é-ÌS-™ø MýS*yìl¯]l §ýlÆý‡-RêçÜ$¢-Ë$ D¯ðlÌS 16ÌZV> hÌêÏ çÜ…„óS-Ð]l$-Ô>Q M>Æ>Å-ÌS-Ķæ$…-ÌZ çÜÐ]l$-ǵ…^éÌS° MøÆ>Æý‡$.
జపనీస్, జర్మన్ భాషల్లో ఉచిత శిక్షణ
న్యూశాయంపేట: అర్హులైన మైనారిటీ విద్యార్థులకు జపనీస్, జర్మన్, (ఫ్రెంచ్, కొరియన్) భాషల్లో ఫౌండేషన్ కోర్సులకు 45 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ, వరంగల్ జిల్లాల మైనారిటీ సంక్షేమాధికారులు మేన శ్రీను, టి.రమేశ్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపా రు. పూర్తి వివరాల కోసం ఆయా జిల్లాల మైనారిటీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు. దరఖాస్తులు ఈనెల 10 వరకు గడువు ఉందని పేర్కొన్నారు.


