లిస్టులో పేరు లేకపోతే ఓటరుగా నమోదు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

లిస్టులో పేరు లేకపోతే ఓటరుగా నమోదు చేసుకోవాలి

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

ప్రొఫెసర్ల నియామకానికి దరఖాస్తులు

● హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని పాత ఓటర్లు ఎలాంటి అపోహలకు గురికాకుండా ఫారమ్‌–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశా రు. ముసాయిదా జాబితాలో పేరు లేని పాత ఓట ర్లు తిరిగి పేరు నమోదు చేసుకునేందుకు ఫారమ్‌–6 దాఖలు చేయవచ్చని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసిందన్నారు. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు సైతం గతంలో ఓటరుగా నమోదైన వారు ఫారమ్‌–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల ఓటర్లు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని కోరారు.

అభివృద్ధి పనులు పూర్తిచేయాలి

న్యూశాయంపేట: కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో భూములు కోల్పోయిన వారికి కేటాయించిన రాజీవ్‌గాంధీ టౌన్‌షిప్‌లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. టౌన్‌షిప్‌లో చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జీపీ భవనం, ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వెటర్నరీ ఆస్పత్రి తదితర నిర్మాణ పనులపై అధికారులతో చర్చించారు. పనుల నాణ్యతలో రాజీపడకుండా నిరంతరం పర్యవేక్షించాలని వారు సూచించారు. సమీక్షలో ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, అదనపు కలెక్టర్లు ఎల్‌.కిశోర్‌కుమార్‌, వైవీ గణేశ్‌, జోనల్‌ మేనేజర్‌ స్వామి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్‌ ఆర్డీఓ సుమ, గీసుకొండ తహసీల్దార్‌ రియాజుద్దీన్‌ పాల్గొన్నారు.

9లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి

కాళోజీ సెంటర్‌: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు హాజరయ్యే ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ నెల 9వ తేదీలోగా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించాలని వరంగల్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ సూచించారు. ఈ మేరకు శుక్రవా రం వరంగల్‌లోని పలు జూనియర్‌ కళాశాలలను ఆ యన సందర్శించి అడ్మిషన్లు, అంతర్గత పరీక్షల రి కార్డులు పరిశీలించారు. విద్యార్థులు ప్రయోగ పరీక్షలకు సిద్ధమవుతున్న తీరు, కళాశాలల్లో ప్రాక్టికల్స్‌ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను తనిఖీ చేశారు.

కాశిబుగ్గ: హనుమకొండ పరిధి కాకతీయ వైద్య కళాశాల, అనుబంధ ఆస్పత్రుల్లో పనిచేయడానికి కాంట్రాక్టు వేతనంపై వివిధ కేటగిరీల్లో సేవలందించేందుకు ప్రొఫెసర్లను నియమిస్తున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మోహన్‌దాస్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా.. వివిధ విభాగాల్లో వైద్య సేవలందించేందుకు 13 మంది ప్రొఫెసర్లు, 10 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 38 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈపోస్టులకు ఎంపికై న అభ్యర్థులు వైద్య విద్యా సంచాలకులు పరిపాలన తెలంగాణ, హైదరాబాద్‌ నియంత్రణలో ఉన్న కాకతీయ వైద్య కళాశాలలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ నెల 12న జరుగు ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. కేఎంసీలోని ఏసీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఉదయ ం10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement