దేదీప్యమానంగా నరకాసుర ప్రతిమ దహనం | - | Sakshi
Sakshi News home page

దేదీప్యమానంగా నరకాసుర ప్రతిమ దహనం

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఉర్సు గుట్ట రంగలీలమైదానంలో శుక్రవారం రాత్రి నరకాసుర వధ కార్యక్రమం వైభవంగా జరిగింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మైదానంలో ఏర్పాటుచేసిన నరకాసుర ప్రతిమను ఆటోమేటిక్‌ ఎలక్ట్రిక్‌ పరికరం ద్వారా కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ మీసాల ప్రకాశ్‌, నగర కమిషనర్‌ వెంకన్నతో కలిసి మాజీ మంత్రి కొండా సురేఖ స్విచ్‌ ఆన్‌ చేయగా బాణసంచా మోతలతో భారీ నరకాసురుడి ప్రతిమ దహనమైంది. అంతకుముందు వేదికపై సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత ఆధ్వర్యంలో డీసీపీ దార కవిత నేతృత్వంలో భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

చెడుపై విజయం సాధించడమే దీపావళి : మాజీ మంత్రి, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ

చెడుపు మంచి విజయం సాధించడమే దీపావళి అని, వేడుకలు జరుపుకోవడం తరతరాలు నుంచి ఆనవాయితీగా వస్తుందని మాజీ మంత్రి, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. రంగలీల మైదానానికి గొప్ప చరిత్ర ఉందని, శ్రీ రంగనాఽథుడి సన్నిధానంలో 100 ఏళ్లుగా దసరా, 20 ఏళ్లుగా నరకాసుర వధ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్లి రవి, కాంగ్రెస్‌ నాయకుడు గోపాల నవీన్‌రాజు, తహసీల్దార్‌ ఇక్బాల్‌, ఇన్‌స్పెక్టర్లు కర్రె స్వామి, మంగిలాల్‌, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆటపాటలు, బాణసంచా మోతలతో దద్దరిల్లిన

రంగలీలమైదానం

చెడుపై మంచి విజయానికి ప్రతీక.. నరకాసుర వధ :

మాజీ మంత్రి కొండా సురేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement