చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన
దహనమవుతున్న నరకాసుర ప్రతిమ
కాశిబుగ్గ: ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్లల వార్డులో సరిపడా పరికరాలు, పూర్తిస్థాయిలో వెంటిలేటర్ సదుపాయం లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంజీఎంలోని సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. చిన్నారులకు మెరుగైన వైద్యసేవలందించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, రోగులకు అవసరమైన మందులు, పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి డాక్టర్ సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రి, సయ్యద్ అలీజా ఖాద్రి, జిల్లా కార్యదర్శి షేక్ బాషామియా, ఆదరి శ్రీనివాస్, గుండె బద్రి, గన్నారపు రమేశ్, అక్కనపల్లి రమేశ్, సంఘం ఏలేందర్ పాల్గొన్నారు.
గెజిటెడ్ అధికారుల సంఘం వరంగల్ జిల్లా కార్యవర్గం
న్యూశాయంపేట: తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీఓ) సంఘం వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం నగరంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఫణికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొల్లా రాజేశ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం కోశాధికారిగా ఎంపీడీఓ పాక శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా ఎకై ్సజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అచ్చారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ స్వాతిరెడ్డి, కల్చరల్ సెక్రటరీగా ఎంపీఓ ఎ.సునీల్, కార్యాలయ కార్యదర్శిగా ఎంజీఓ సునీల్, జాయింట్ సెక్రటరీలుగా మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, పీఆర్ ఏఈ వెంకటేశ్వర్‌రావును ఎన్నుకున్నారు. నాయకులు అన్నమనేని జగన్‌మోహన్‌రావు, కోలా రాజేష్‌కుమార్, కిరణ్‌కుమార్, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
● మాజీ ఎమ్మెల్యే
చాడా వెంకట్‌రెడ్డి


