యాసంగిలో పంట మార్పిడి చేయాలి | - | Sakshi
Sakshi News home page

యాసంగిలో పంట మార్పిడి చేయాలి

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

వరంగల్‌ చౌరస్తా: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు యాసంగిలో పంట మార్పిడి చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జలపతిరావు సూచించారు. వరంగల్‌ అబ్బనికుంటలోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ సోమిడి శ్రీనివాస్‌ అధ్యక్షత శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో జలపతిరావు మాట్లాడారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల మార్పిడి చేయాలని జనుము, మినుములు, తెల్ల నువ్వులు తదితర పంటలు సాగుచేయాలన్నారు. తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఉంటాయని సూచించారు. భూగర్భ జలాలు తగ్గుతున్న క్రమంలో వరి, మొక్కజొన్న పంటలు వేయడం వల్ల ఆఖరి దశలో నీరందక పంటలు ఎండిపోతాయని తెలిపారు. రైతులు భూసార పరీక్షలు చేయించాలని సూచించారు. తెలంగాణ రైతు సంఘం గౌరవ అధ్యక్షుడు, తెలుగు అకాడమీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వెంకటనారాయణ మాట్లాడుతూ.. మారిన వాతావరణ పరిస్థితుల్లో సరైన పంటలు పండించేందుకు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలన్నారు. నాబార్డ్‌ వంటి జాతీయ సంస్థల సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాచర్ల బాలరాజు, ఓదెల రాజయ్య, సోమ రామ్మూర్తి, షేక్‌ హుస్సేన్‌, బుగ్గే శేఖర్‌, హంసల్‌ రెడ్డి, దామోదర్‌రెడ్డి, ముగిడే పీరయ్య, మోహన్‌ రావు, చిర్ల రవీందర్‌, రవీందర్‌, విజయ్‌ పాల్గొన్నారు.

ప్రొఫెసర్‌ జలపతిరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement