సమర్థవంతంగా ‘ఐజీఎంఎస్‌’ అమలు | - | Sakshi
Sakshi News home page

సమర్థవంతంగా ‘ఐజీఎంఎస్‌’ అమలు

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

న్యూశాయంపేట: జిల్లాలో గ్రావెల్‌, మట్టి అక్రమ తవ్వకాలను అరికట్టడంతో పాటు రవాణా అనుమతుల జారీ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఇంటిగ్రేటెడ్‌ గ్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఐజీఎంఎస్‌) సాఫ్ట్‌వేర్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ రూపొందించిన ఐజీఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ పనితీరును గురువారం కలెక్టరేట్‌లో అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయి నియంత్రణ, జిల్లాస్థాయి పర్యవేక్షణ వరకు వివిధ స్థాయిల్లో పనిచేసే అధికారుల విధులు, అనుమతుల జారీ ప్రక్రియ, నివేదికల పర్యవేక్షణ విధానాలు తెలుసుకున్నారు.

లబ్ధిదారుల ఎంపిక

తెలంగాణ క్రిస్టియన్‌ మైనారిటీస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి పెట్టీ బిజినెస్‌, ఈ–స్కూటర్‌, ఈ–బైక్‌ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం గురువారం కలెక్టరేట్‌లో లక్కీడిప్‌ నిర్వహించారు. కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధ్యక్షతన ఎంపిక కమిటీ సమక్షంలో లక్కీడ్రా తీశారు. ఎంపికై న లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా యూనిట్లు గ్రౌండింగ్‌ చేయాలని, లేనిపక్షంలో ఎంపికను రద్దు చేసి వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న దరఖాస్తుదారులకు అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, డీఆర్‌డీఓ, రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌, లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement