వరంగల్ అర్బన్: వరంగల్ ఉర్సుగుట్ట వద్ద ఈనెల 6న నిర్వహించనున్న నరకాసుర వధ కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగొద్దని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. బుధవారం ఉర్సు రంగలీల మైదానం, రంగశాయిపేటలోని మహంకాళి దేవాలయం సమీపంలో నిర్వహించనున్న నరకాసుర వధ కార్యక్రమాల ఏర్పాట్లను కమిషనర్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం కాశిబుగ్గలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాల్ పనుల పురోగతిని పరిశీలించారు. ఉనికిచర్లలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలను పరిశీలించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్‌కుమార్, ఎంహెచ్‌ఓ రాజేశ్, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగాల సిబ్బంది తదితరులు ఉన్నారు.
యూజీడీపై వీడియో కాన్ఫరెన్స్
నగరంలో భూగర్భ డ్రెయినేజీ (యూజీడీ) వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం లభించిన నేపథ్యంలో, ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డి.తారా బుధవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో హనుమకొండ క్యాంపు కార్యాలయంలో నుంచి బల్దియా కమిషనర్ టి.వెంకన్న పాల్గొనగా.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయ వనరులు, సొంత ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ఉన్న అవకాశాలపై ఆమె వివరాలు కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బల్దియా కమిషనర్ టి.వెంకన్న
నగరంలో అభివృద్ధి పనుల తనిఖీ


