పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
కాజీపేట: పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరికి కూడా వైఎస్సార్ నగర్ కాలనీలో పట్టాలు ఇప్పించలేకపోయిన నాయకులు నేడు రాజకీయ లబ్ధ్ది కోసం చిల్లర మాటలు మాట్లాడుతున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 62వ డివిజన్ సోమిడిలోని ఎస్సీ కాలనీలో బుధవారం రూ.17 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వైఎస్సార్‌నగర్ కాలనీ భూమి ప్రైవేటుదైతే తాను జోక్యం చేసుకోబోనని, ప్రభుత్వ భూమిగా తేలితే గజం స్థలం కూడా ప్రైవేట్ వ్యక్తులకు వదిలిపెట్టేదిలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, సుంచు అశోక్, మెరుగు రాజయ్య పాల్గొన్నారు.
మామునూరు: వరంగల్ మామునూరు విమానాశ్రయాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్‌నాయక్ గురువారం సందర్శించనున్నారు. ఈసందర్భంగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ పర్యవేక్షణలో జరుగుతున్న పనులు ఆయన పరిశీలించనున్నారు. డిసెంబర్ మొదటివారంలో దేశ ప్రధాని మోదీ ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించి, పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ ఎయిర్‌పోర్ట్‌ను పరిశీలించి నివేదిక అందించనున్నట్లు తెలిసింది.


