బుధవారం శ్రీ 4 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 4 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

Nov 4 2026 2:26 AM | Updated on Nov 4 2026 2:26 AM

న్యూస్‌రీల్‌

ఆయనదే హవా..

వరంగల్‌ అర్బన్‌ : గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని కంప్యూటర్‌ విభాగం అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ఔట్‌ సోర్సింగ్‌ టెక్నికల్‌ పర్సన్‌ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని, ఈ వింగ్‌లో రెండు దశాబ్దాలకుపైగా ఉండడంతో సాఫ్ట్‌గా, సేఫ్టీగా కార్పొరేషన్‌ ఖజానాకు కన్నం వేస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్‌ వరంగల్‌కు సంబంధించిన వివరాలన్నీ ఈ–ఆఫీస్‌, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌లో నిక్షిప్తంగా నమోదవుతున్నాయి. కీలకమైన విభాగానికి భద్రతగా వింగ్‌ అధికారికి బాధ్యతలు కట్టబెట్టాలి. కానీ, ఓ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి అంతా చూసుకుంటున్నాడని, ఉన్నతాధికారి పర్యవేక్షణ లేకపోవడంతో కంప్యూటర్‌ ఆపరేటర్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కంప్యూటర్‌ వింగ్‌కు బాధ్యులెవరు?

బల్దియాలో 43మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇదో ప్రత్యేక వింగ్‌గా కొనసాగుతోంది. బల్దియాకు సంబంధించిన అన్నీ కార్యకలాపాలు కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తుంటారు. కానీ, అధికారులు ఈ వింగ్‌లో జరిగే కార్యకలాపాలపై కన్నెత్తి చూడటం లేదు. ఔట్‌ సోర్సింగ్‌ టెక్నికల్‌ పర్సన్‌ ఒకరు అన్నీ వ్యవహారాలను చక్కదిద్దుతున్నాడు. అత్యంత కీలకమైన ఈ వింగ్‌కు బాధ్యత కలిగిన పర్యవేక్షణ అధికారి లేరు. పదుల సంఖ్యలో ఉన్న అధికారులు, వంద మందికి పైగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్‌ సిబ్బందికి కంప్యూటర్‌ విభాగంలోని వ్యవహారాలపై అవగాహన లేకపోవడంతో ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆపరేటర్లదీ అదే తోవ..

కంప్యూటర్‌ విభాగంలోని కొన్ని సెక్షన్‌లలో పనిచేసే ఆపరేటర్లు సైతం ఏళ్ల తరబడి పాతుకు పోయారు. అంతర్గత బదిలీలు లేక సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అనర్హులకు పింఛన్ల నమోదు, ఇంజనీరింగ్‌ పనులు, ట్రేడ్‌ లైసెన్స్‌, ఆస్తిపన్ను, యూజర్‌ చార్జీలు, బిల్డింగ్‌ పర్మిషన్లు, బయోమెట్రిక్‌ తదితర వ్యవహారాల్లో తమ సాంకేతికతను ఉపయోగిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇదంతా ఆ వింగ్‌ బాస్‌ కనుసన్నల్లోనే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. బల్దియా కమిషనర్‌ ఇప్పటికై నా కంప్యూటర్‌ వింగ్‌పై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని, లేకపోతే భవిష్యత్‌లో సాంకేతికంగా విపత్కర పరిస్థితులు ఎదురుకానున్నాయనే వాదన వినిపిస్తోంది.

ఔట్‌ సోర్సింగే..

ఆ వింగ్‌కు బాస్‌

అక్రమాలన్నీ ఆయన కనుసన్నల్లోనే

కంప్యూటర్‌ కార్యకలాపాలను

పట్టించుకోని బల్దియా

రెగ్యులర్‌ పర్యవేక్షణాధికారి లేరు..

గత రెండు దశాబ్దాలుగా బల్దియా కంప్యూటర్‌ వింగ్‌లో ఓ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి హవా కొనసాగుతోంది. వస్తూ, వెళ్తున్న కమిషనర్ల వద్ద అమాయకంగా, చనువుగా ఉంటూ శభాష్‌ అనిపించుకుంటాడని, ఇదే అదునుగా తన కార్యకలాపాలను కొనసాగిస్తుంటాడన్న ప్రచారం ఉంది. చిన్నపాటి ఎలక్ట్రానిక్‌ పరికరంనుంచి రూ.లక్షల్లో కొనుగోలు చేసే కంప్యూటర్లు, బయోమెట్రిక్‌ యంత్రాలు, ట్యాబ్‌లు, జిరాక్స్‌ యంత్రాలు, ఇలా ఏది కొనుగోలు చేసినా ఆయనకు కమీషన్‌ ముట్టజెప్పాల్సిందేనని చెబుతుంటారు. సదరు కంపెనీలు, సంస్థలు ఆ వ్యక్తితో ముందుగానే ఒప్పందం చేసుకొని కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని, చాలామేరకు ఆయన బినామీ పేర్ల మీద కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఈ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రూ.కోట్లకు పడగలెత్తాడని బల్దియాలోని కొందరు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement