బల్దియా కమిషనర్ టి.వెంకన్న
వరంగల్ అర్బన్ : తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులతో కలిసి గ్రేటర్ వరంగల్ పరిధిలోని మడికొండ, మెట్టుగుట్ట, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి పైపులైన్లు, నీటి సరఫరా వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ, వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా మడికొండలోని బాలాజీనగర్ వాటర్ ట్యాంక్ నుంచి మెట్టుగుట్ట వరకు తాగునీటి పైపులైల్‌ను పరిశీలించి, నీటి సరఫరా వ్యవస్థ పనితీరును సమీక్షించారు. వివిధ కాలనీల్లో నిర్మించిన సీసీ రోడ్లను, ఇందిరమ్మ కాలనీ సమీపంలోని శ్మశానవాటికను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం మడికొండ, రాంపూర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. ఎస్‌ఈ రాజ్‌కుమార్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈలు రవికుమార్ పాల్గొన్నారు.
పన్ను వసూళ్లలో పురోగతి కనిపించాలి
నగరంలో పన్ను వసూళ్లలో పురోగతి కనిపించాలని, నిర్దేశిత లక్ష్యాలను సాధించే దిశగా రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని బల్దియా కమిషనర్ టి.వెంకన్న ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్‌న్స్ హాల్‌లో డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ఇన్‌స్పెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కమిషనర్ పన్ను వసూళ్ల పురోగతిని సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ అదనపు కమిషనర్ సమ్మయ్య, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, శ్రీనివాస్, పన్నుల అధికారి రామకృష్ణ, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


