మలక్‌పేట: హత్యాయత్నం, దోపిడీ కేసులో ముగ్గురు నిందితులను మలక్‌పేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రూ.7 లక్షల విలువైన 22 సెల్‌ఫోన్లు, నాలుగు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ కుందూరు వెంకట్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా తాళ్లగడ్డ గ్రామానికి చెందిన కేసరి మణికంఠ అలియాస్ నరమ్‌దాస్ అలియాస్ మున్నా అలియాస్ మణి, వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన నారపోగు వంశీకృష్ణ అలియాస్ నారపాక వంశీకృష్ణ అలియాస్ నల్లి అలియాస్ వంశీ పాత నేరస్తులు. ఆటోనడుపుతూ సికింద్రాబాద్ అల్ఫా హోటల్ ఫుట్‌పాత్‌పై నివాసం ఉంటున్నారు. జైల్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. 5 నెలల క్రితం జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి పలు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బాలాజీనగర్‌కు చెందిన అజయ్‌కుమార్ సికింద్రాబాద్‌లోని అజామ్ మిలన్ గార్మెంట్స్‌లో సేల్స్‌మెన్‌గా చేస్తున్నాడు. మణికంఠ, వంశీకృష్ణ అపహరించిన ద్విచక్రవాహనాలు, సెల్‌ఫోన్లు ఇతని ద్వారా విక్రయించేవారు. ఈక్రమంలో సూర్యాపేటకు చెందిన హేమలత మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గడ్డిఅన్నారం పోచమ్మబస్తీలో స్నేహితులతో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ గ్రూప్ పరీక్షలకు ప్రిపరేషన్ అవుతోంది. అక్టోబర్ 27న హేమలత చదువుకుంటున్న సమయంలో మణికంఠ ఇంట్లోకి ప్రవేశించి ఆమైపె కత్తి దాడి చేసి సెల్‌ఫోన్ తీసుకుని అక్కడ నుంచి పరారయ్యాడు. ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. సోమవారం గడ్డిఅన్నారం క్రాస్‌రోడ్‌లో టాస్క్‌ఫోర్స్, పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా మణికంఠ పట్టుబడ్డాడు. అతని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. బాధిత మహిళకు చెందిన వన్‌ప్లస్ సెల్‌ఫోన్, వివిధ కంపెనీలకు చెందిన 22 సెల్‌ఫోన్లు, ఒక స్టీల్ కత్తి, 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. మలక్‌పేట డీఐ ధర్మారెడ్డి గిరి, క్రైం సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు. సమావేశంలో ఎస్సైలు సంజీవరెడ్డి, తేజ్యానాయక్, రాజశేఖర్‌రెడ్డి, నర్సింహులు, క్రైం సిబ్బంది పాల్గొన్నారు.
ధర్మసాగర్ : నమ్మిన సిద్ధాంతం కోసం మూడు దశాబ్దాలకు పైగా సొంతూరును విడిచి, అడవి బాట పట్టిన మునిగాల రవి దంపతులు ఐదు నెలల క్రితం జనజీవన స్రవంతిలో కలిసిన విషయం తెలిసిందే. కాగా రవి దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి జీవించడానికి మంగళవారం సొంత గ్రామమైన పెద్దపెండ్యాలకు విచ్చేయగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తోట నాగరాజు ఆధ్వర్యంలో వారిని ఆహ్వానించి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతం కోసం ఉద్యమ బాటలో పయనించి, తిరిగి గ్రామానికి వచ్చిన రవి దంపతులు సాధారణ జీవనం సాగించడానికి గ్రామస్తులందరి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
శ్రీధరాచార్యులకు సన్మానం
కాళోజీ సెంటర్: తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రముఖ వ్యాఖ్యాత, గాయకుడు ఠంయ్యాల శ్రీధరాచార్యులను జిల్లా విద్యాశాఖ అధికారులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఎల్బీనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయన సమ్మిళిత విద్యపై నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో వ్యాఖ్యాత, గాయకుడిగా సేవలందించారు.
రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
కాజీపేట: కాజీపేట ఈఎల్‌ఎస్ రైల్వే క్వార్టర్స్‌లో మంగళవారం రాత్రి రైల్వే ఉద్యోగి దూలం శ్రీనివాస్ (45) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శ్రీనివాస్ కొద్దిరోజులుగా విధులకు హాజరుకాకుండా ఇంటి వద్దే ఉంటున్నారు. రామగుండంలో పాయింట్స్‌మెన్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌పై అధికారులు క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. పోలీ సులు కేసు నమో దు చేసి విచారణ జరుపుతున్నారు.


