ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి

Nov 4 2026 2:26 AM | Updated on Nov 4 2026 2:26 AM

ఖిలా వరంగల్‌: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సన్న బియ్యం విక్రయించాలని వరంగల్‌ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (డీఎస్‌ఓ) డి.కిష్టయ్య హె చ్చరించారు. మంగళవారం జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ సంధ్యారాణి, జిల్లా మెట్రాలజీ అధికారి మనోహర్‌తో కలిసి గొర్రెకుంటలోని గణేష్‌, హరిహర రైస్‌ మిల్లులు, నర్సంపేటలోని శ్రీజగదానంద మోడ్రన్‌ రైస్‌ మిల్లులపై ఆకస్మికంగా దా డులు నిర్వహించారు. రైస్‌ మిల్లుల స్టాక్‌ రిజిస్టర్లు, నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, నర్సంపేట డీటీ సంధ్యారాణి, సిబ్బంది పాల్గొన్నారు.

తక్కువ తూకంతో బియ్యం విక్రయం

హన్మకొండ అర్బన్‌ : తక్కువ తూకంతో బియ్యం విక్రయిస్తున్న రెండు దుకాణాల యజమానులపై కేసులు నమోదయ్యాయి. హనుమకొండ నయీంనగర్‌లోని మూడు బియ్యం వ్యాపార దుకాణాల్లో అదనపు కలెక్టర్‌ ఎన్‌. రవి మంగళవారం పౌర సరఫరాలు, తూనికలు, కొలతల శాఖ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గణపతి రైస్‌ ట్రేడర్స్‌లో 25 కిలోల బియ్యం సంచులను తూకం వేయగా, ఒక్కో సంచిలో ఒకటి నుంచి ఒకటిన్నర కిలోల వరకు తక్కువగా తూకం ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా హనుమకొండలోని హరినాథ్‌ రైస్‌ మర్చంట్‌, నయీంనగర్‌లోని చిదర సంపత్‌ కుమార్‌ ఫుడ్‌ గ్రెయిన్‌ డీలర్‌, శ్రీ శ్యామ్‌ ట్రేడర్స్‌ దుకాణంలోనూ తక్కువ తూకంతో బియ్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి, ఆ దుకాణ యజమానులపై కేసు నమోదు చేశారు. అదనపు కలెక్టర్‌ రవి మాట్లాడుతూ.. బియ్యం వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలని ఆదేశించారు. తనిఖీల్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మహేందర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ నాగేంద్రప్రసాద్‌, తూనికలు, కొలతల శాఖ అధికారులు భద్ర నాయక్‌, భాస్కర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌ పాల్గొన్నారు.

వరంగల్‌ డీఎస్‌ఓ కిష్టయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement