కలెక్టర్‌ వచ్చే వరకు ఖాళీ కుర్చీలే! | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ వచ్చే వరకు ఖాళీ కుర్చీలే!

Nov 3 2026 2:21 AM | Updated on Nov 3 2026 2:21 AM

కలెక్టర్‌ వచ్చే వరకు ఖాళీ కుర్చీలే!

● గ్రీవెన్స్‌లో అధికారుల నిర్లక్ష్యం

● ప్రజావాణికి సమయపాలన కరువు

హన్మకొండ అర్బన్‌: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి అధికారులు సమయపాలన పాటించడం లేదు. ఉన్నతాధికారులంతా తప్పనిసరిగా సకాలంలో హాజరు కావాలని కలెక్టర్‌ ఆదేశిస్తున్నా ఆచరణలో మాత్రం మార్పు కనిపించట్లేదు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ వివిధ కారణాలతో ఉదయం 11 గంటల తర్వాత హాజరయ్యారు. అయితే ఉదయం 10.30 గంటల నుంచే కొందరు అధికారులు ఒక్కొక్కరుగా వచ్చారు. మరికొందరు తమ కార్యాలయాల్లోనే ఉండిపోయారు. కలెక్టర్‌ రాగానే సమాచారం ఇవ్వాలని తమ సిబ్బందిని కాన్ఫరెన్స్‌ హాల్‌ వద్ద ఉంచారు. దీంతో ఉదయం 10.30 గంటల వరకు కాన్ఫరెన్స్‌ హాల్‌లో దాదాపు పది మంది అధికారులే కనిపించారు. అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి వచ్చి ప్రజల నుంచి వినతులు స్వీకరించడం ప్రారంభించినప్పటికీ పలువురు అధికారుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 11:24 గంటలకు కలెక్టర్‌ హాజరైన తర్వాత ఒక్కొక్కరుగా అధికారులు వచ్చి తమ సీట్లలో కూర్చున్నారు. సమయపాలన పాటించాలని కలెక్టర్‌ ఆదేశిస్తున్నప్పటికీ అధికారులు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల తీరుపై కలెక్టర్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement